Thursday, 30 June 2016

కొండపల్లిలో జన మైత్రి పోలీస్ సభ

కొండపల్లిలో జన మైత్రి పోలీస్ సభ

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లోని కొండపల్లి గ్రామలో నిర్వహించిన జన మైత్రి సభ గురువారం ఏర్పాటు చేశారు .   జన మైత్రిలో    ఎస్ ఐ  టివి రావు    మాట్లాడుతూ  పోలిసులు  ప్రజల కోసం ఫ్రెండ్లిగా ఉంటారని,  ఏ సమస్యలు వచ్చిన  సమస్యలు పరిష్కరించడానికి 24 గంటలు పోలీసుల మీ చెంత  ఉంటారని  అన్నారు ప్రజలు భయాన్ని విడి మాకు ఎలాంటి సమాచారం  అయినా అందించాలని, మేము మీకోసమే వుంటూ  గ్రామ అభివృద్ధి శాంతి భద్రతలు  తోడ్పడతమన్నారు ప్రజలకు  చట్టాల గురించి అవగాహన కల్పించారు   ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ మంతుమేర  గ్రామా ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కాలేజీ నూతన భవనం ప్రారంభించాలి -- ఎస్ ఎఫ్ ఐ

ప్రభుత్వ జూనియర్ కాలేజీ నూతన  భవనం ప్రారంభించాలి -- ఎస్ ఎఫ్ ఐ

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  రెబ్బెన మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ నూతన  భవనం నిర్మాణం పూర్తి అయింది కానీ తరగతులు జరగడం లేదని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు గుడిసెల కార్తిక్ అన్నారు రెబ్బెనలో భారత విద్యార్థి ఫెడరేషన్  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాలేజీ భవనం పూర్తి అయినా తరగతులు ప్రారభించకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు అని కాలేజీ మరియు స్కూల్ తరగతులు ఒకే చోట జరగడం వల్ల అరాకొరా చదువులతో విసిగి పోతున్నారు కావున ఉన్నంత అధికారులు గమనించి కాలేజీ నూతన భవనం ప్రారంభించాలని కాలేజీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి త్రాగు నీటి సదుపాయం కల్పించాలని కోరారు ఈ సమావేశం లో ఎస్ ఎఫ్ ఐ డివిజనల్ ఉపాధ్యక్షుడు ప్రేమ్ సాగర్, ఎస్ ఎఫ్ ఐ డివిజినల్ సభ్యుడు అశోక్ వున్నారు.

అంగన్ వాడి బాట ర్యాలీ

 అంగన్ వాడి బాట ర్యాలీ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో అంగన్ వాడి కార్యకర్తలు  మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలను బడిలో చెరిపియాలని అంగన్ వాడి బాట ఐదు రోజుల కార్యక్రమం ర్యాలీ  గురువారం రెబ్బెన గ్రామ పంచాయితీ నుంచి ప్రధాన వీదూల  గుండా నిర్వహించారు చిన్న పిల్లలను చిన్న తనం నుంచే అంగన్ వాడిలో  చేర్పియాలని వారికి విద్యతో పాటు పోష్టిక ఆహారం అందిస్తామన్నారు ఈ ర్యాలీలో  సూపర్ వైజర్లు  బాగ్యలక్మి, లక్మి ,అంగన్ వాడి కార్యకర్తలు బాలమ్మ ,ప్రమీల ,అనిత,సువర్ణ ,స్వర్ణలత, సంధ్యారాణి, మంజుల  మరియు తదితరులు పాల్గొన్నారు.

అధిక ఫిజులు వసులు చేస్తే ఉరుకొం ; విద్యార్థి వామ పాక్ష నాయకులు

   అధిక ఫిజులు వసులు చేస్తే ఉరుకొం ; విద్యార్థి వామ పాక్ష నాయకులు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో వామ పాక్ష విద్యార్థి నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు రెబ్బెన మండలంలో గోలేటి కె ఎల్ మహేంద్ర భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి సంఘ నాయకులు  ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు కార్తిక్ ఆధ్వర్యంలో   వామ పాక్ష నాయకులు దుర్గం రవీందర్ ఏ ఐ ఎస్ ఎఫ్,   కడతల సాయి టి వి వి,  పాపారావు పి డి ఎస్ యూ, నగేష్ ఏ ఐ ఎఫ్ డి ఎస్, ఆత్మకూరి ప్రశాంత్ ఏ ఐ ఎస్ ఎఫ్, క్రాంతి  ఏ ఐ ఎస్ ఎఫ్    మాట్లాడారు  ప్రస్తుత  ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ లకు అనుమతులను ఇస్తూ  ప్రభుత్వ విద్యను దూరం చేస్తుంది అని అన్నారు ప్రైవేట్ పాఠశాలలో కనీస వసతులు లేకుండా ఫిజుల పేరులతో వేలాది రూపాయలు వసులు చేస్తున్నారని అన్నారు మండల విద్యార్థి అదికారులు పరోక్షంగా ప్రైవేట్ పాఠశాలలకు మద్దతు పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలను మరుగున పడేస్తున్నారు అన్ని విద్య సంస్థలలో ప్రభుత్వ ప్రచురించిన పుస్తకాలను మాత్రమే వాడాలి అని కోరారు ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల సామాగ్రిలా పేరుతో అధిక ఫీజులను వసులు చేస్తుండగా సంబంధిత మండల విద్య అధికారి ఏ ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోక పోవడం శోచనీయమన్నారు ఇప్పటికైనా ఉన్నత విద్య అధికారులు చర్యలు తీసుకోవాలి లేకపోతే విద్యార్థి వామ పాక్ష సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు   ఈ సమావేశం లో కె సాయి,చరణ్ ,ప్రేమ్ సాగర్ ,అశోక్,పుదారి సాయి,కస్తూరి రవి ,మహిపాల్ ,శేఖర్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కి బి సి సంఘ మహిళల ఘన సన్మానం

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కి బి సి సంఘ మహిళల ఘన సన్మానం 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  బి సి సంఘం ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ మార్కెట్  కమిటీ వైస్ చైర్మన్ గా పదవి పొందిన సందర్బంగా బుధవారం ఆమె స్వగృహంలో  బి సి సంఘం జిల్లా అధ్యక్షురాలు  ఇ. సువర్ణ ,కోశాధికారి ఎ.చంద్రకళ ఆమెను ఘనంగా సన్మానించారు.మహిళలు అందరూ రాజకీయంగా ఎదగాలని,అన్ని రంగాలలో చైతన్య వంతులు కావాలని జిల్లా అధ్యక్షురాలు ఇ. సువర్ణ పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో పి.సుగుణ, పి.రజిత ,పి.లత , పార్వతి ,పోషయ్య ,చంద్రగిరి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కె.శంకరమ్మ మహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ,నా పదవికి న్యాయం చేకూరుస్తానని తెలిపారు.         

ప్రభూత్వ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలి; దుర్గం రవీందర్

ప్రభూత్వ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలి;   దుర్గం రవీందర్

రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  ప్రభూత్వ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని బుధవారం రెబ్బెన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లుకు ఎ ఐ యస్ యఫ్   జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్  వినతి పత్రం అంద జేశారు అనంతరం మాట్లాడుతూ  ప్రభూత్వ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని అదేవిదంగా ప్రభూత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేసి విద్యారంగాన్ని ముందంజలో తిసుకేల్లలన్నారు అలాగే ప్రభూత్వ పాటశాలలో ఆంగ్ల విద్యా భోధన ను అమలు పరచాలని అన్నారు రోజురోజుకు ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలు ఎక్కువై కళాశాలలో  కనీస సౌకర్యాలు కల్పించ కుండ విద్యార్దుల తలిదండ్రుల వద్ద నుండి వేలాది రూపాయలు అందుకుంటూని బందనకు విరుద్దంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసుకొని విధ్యాను వ్యాపారంగా మారుస్తున్నారని అన్నారు నిబందనలకు విరుద్ధంగా వ్యహరిం చె కళాశాలలపై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పుదరి సాయి ,మైపాల్ ,తిరుపతి ,రాజకుమార్ ,కిషోర్ తదితరాలు పాల్గొన్నారు .










Tuesday, 28 June 2016

క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత


     క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత 


(రెబ్బెనవుదయంప్రతినిధి) రెబ్బనలోమండలస్థాయి  క్రికెట్   క్రీడల విజేతలకు ఎంపిపి కార్నతం సంజీవ్ కుమార్  బహుమతులు  అందచేశారు స్వర్గీయ బండారి ఫణికుమార్ స్మారక చిహ్నార్థం ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ పోటీలలో   మొదటి బహుమతి   జంటి లెవెన్స్ జూనియర్స్ రెబ్బెన 10,000 లతో పాటు బహుమతి అందచేశారు రెండవ బహుమతి 5000 ఫ్రెండ్స్ రెబ్బెన  క్రీడాకారులకు అందచేశారు అదేవిధముగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అజమేరా శేఖర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చీకటి మహేందర్ కి అందచేశారు  అనంతరం వారు మాట్లాడుతూ యువకులు విద్యతో పాటు క్రీడా రంగంలో ఆశక్తి కనపరుస్తూ  మండలాన్ని ముందంజలో ఉండేలా చూడాలన్నారు.    ఈ కార్యక్రమములో సర్పంచు పెసరు వెంకటమ్మ , మార్కెట్ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ , ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , తూర్పుజిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ , చిరంజీవి , పాపయ్య , శాంతి  తదితర క్రీడా కారులు  పాల్గొన్నారు.

పర్యావరణం కాపాడుదాం వన్యప్రాణుల సంరక్షిధాం ; జి ఏం రవిశంకర్

పర్యావరణం కాపాడుదాం వన్యప్రాణుల సంరక్షిధాం ; జి ఏం రవిశంకర్

(రెబ్బెనవుదయంప్రతినిధి) వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని వన్య ప్రాణుల అవయవాల అక్రమ నిమిత్తం వన్య ప్రాణులను చంపడాన్ని ప్రపంచ మానవాళి ముక్తకంఠంతో వ్యతిరేకించాలి అని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కె రవిశంకర్ అన్నారు. సోమవారం రోజున రెబ్బెన మండలం గోలేటి లో  జనరల్ మేనేజర్ కార్యాలయం నుంచి గోలేటి ప్రధాన రహదారుల గుండా ప్రజలకు పర్యావరణ సంరక్షణ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు  అనంతరం వారు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి వన్య ప్రాణుల సంరక్షణ విషయంలో కఠినముగా వ్యవహరిద్దాం అనే విషయాన్ని మరియు వన్యప్రాణుల అక్రమ వాణిజ్యాన్ని అరికడతాం అనే నినాదాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భముగా ప్రకటించారని తెలియచేసారు బెల్లంపల్లి ఏరియా సింగరేణి సంబందించిన ఖాళీ స్థలాలలో, కాలనీలలో గనులలో 2016 సంవత్సరానికి 177హెక్టార్ల స్థలంలో 4,42,500 ల మొక్కలు నిర్దేశించినట్టు తెలిపారు  2015 లో 151 హెక్టార్ల మొక్కలు నటినట్లు తెలిపారు ప్రతి ఒక్కరు అడవులను సంరక్షించుకుంటూ ఖాళీ ప్రదేశాలలో ,ఇళ్లలో ,స్కూళ్లలో ,ఆఫీసులలో ,రహదారుల వెంబడి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి అని అన్నారు ఈ పర్యావరణ ర్యాలీలో కార్మికులు,సింగరేణి సేవా సభ్యులు సింగరేణి ఉన్నత పాఠశాల గోలేటి ,సెయింట్ ఆగ్నెస్ స్కూల్ పిల్లలు,ఎస్ ఓ టు జి ఎమ్ కొండయ్య, సదాశివ్, తిరుపతి ఏఐటీయూసీ ,స్కూల్ టీచర్స్ ,పర్యావరణ అధికారి తదితరులు పాల్గొన్నారు.

Friday, 24 June 2016

రెబ్బెనలో పశువైద్య శిబిరం


రెబ్బెనలో పశువైద్య శిబిరం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం సర్పంచ్ పెసరు వెకటంమ్మ ఆధ్వర్యంలో పశువైద్య సిబంది శిబిరం నిర్వాయించారు. పశువైద్యాధికారి సాగర్ మాట్లాడుతూ గ్రామపంచాయితిలో వర్షకాలం ప్రారంభం అవడం వలన పశువులకు వ్యాధులు సోకకుండా 750 పశువులకు ముందస్తు చర్యగా గాలికుంట వ్యాధులు సోకకుండా నివారణ టీకాలు వేయడం జరిగిందన్నారు. రైతులు టీకాలు వేయించాలని కోరారు ఈ శిబిరంలో ఉప సర్పంచ్  బి శ్రీధర్ కుమార్  , సింగిల్ విండో డైరెక్టర్ పెసర్ మధునయ్య , వార్డ్ మెంబర్ యల్ రమేష్ తదితర రైతులు ఉన్నారు.


విలేజ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎలక్షన్స్ లకు ఏర్పాట్ల సమీక్ష

విలేజ్  ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ  ఎలక్షన్స్ లకు ఏర్పాట్ల సమీక్ష 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); విలేజ్  ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ  ప్రాంతాలల్లో ఎలక్షన్ లు సక్రమం గా జరగాలని రెబ్బెన మండల తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ కార్యాలయం లో ఐటిడిఏ,వి.ఆర్.ఓ ఏర్పాటు చేసిన అధికారుల సమావేశం లో మాట్లాడారు. ఈ శనివారం 25 వ తేదీన  విలేజ్  ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ    ప్రాంతాలల్లో ప్రెసిడెంట్,  వైస్  ప్రెసిడెంట్, సెక్రెటరీ ల కోసం ఎలక్షన్స్ మండలం లోని  11ఏజెన్సీ గ్రామలలో జరుగుతాయని,  వీరిలో ప్రెసిడెంట్ గా  గ్రామ సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ టి వర్గానికి చెందిన స్రి  పురుషా  అభ్యర్థులు, సెక్రెటరీ గా డ్వాక్రా మహిళా సంఘాల నుండి ఎస్ టి వర్గానికి చెందిన మహిళా అభ్యర్థులను ఎన్నిక జరుగుతుందని అన్నారు. ఇందుకు ఆసక్తి కలిగిన  18సం,, నిండి ఓటు హక్కు కలిగి ఎస్ టి వర్గానికి చెందిన స్రి  పురుషా  అభ్యర్థులు ఆయా ఏజెన్సీ గ్రామలలో హాజరు కావాలని కోరారు. ఈ సమావేశం లో ఉప తహసీల్దార్ రామ్మోహనరావు, ఐటిడిఏ ఏపియం వెంకటరమణ, హన్మంతరావు, తిరుపతి ,  శంకర్, ఆర్ఐ  అశోక్,  వి.ఆర్.ఓ  పంచాయతీ కార్యదర్సులు  తదితరులు పాల్గొన్నారు. 

Wednesday, 22 June 2016

ప్రైవేటు విద్యా సంస్థలలో దోపిడిని హరికట్టాలి ; యన్ యస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్

ప్రైవేటు విద్యా సంస్థలలో దోపిడిని హరికట్టాలి ; యన్ యస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్



రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  ప్రైవేటు విద్యా సంస్థలలో పాట్య పుస్తకాలు ను అమ్ముతూ విధ్యాను వ్యాపారంగా మారుస్తున్నారని, నిబందనలకు విరుద్ధంగా వ్యహరిం చె పాటశాలల పై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలని యన్ యస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్ బుధవారం రెబ్బెన మండల విద్యాధికారికి  వినతి పత్రం అంద జేశారు అనంతరం మాట్లాడుతూ రోజురోజుకు ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలు ఎక్కువై పాటశాలలో కనీస సౌకర్యాలు కల్పించ కుండ విద్యార్దుల తలిదండ్రుల వద్ద నుండి వేల లాది రూపాయలు దండు కుంటు నిబందనకు విరుద్దంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసుకొని విద్యార్థులకు అవసరమైయే పుస్తకాలు, టై , బెల్ట్స్ , షూస్ , బ్యాగ్స్ మొదలగు సామగ్రి వారి వద్ద కోణాలని డిమాండ్ చేస్తూ  డొనేషన్స్ పేర్లతో అధిక పీజులు వసూళ్లు చేస్తున్నారు అలాగే హర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలన్నారు.   పాటశాల లో కనీస సౌకార్యాలు లేకపోవడంతో విద్యార్ధులు తివ్ర  ఇబ్బందులకు గురి అవుతున్నారని పాటశాలలో కనీస వసతులు ఐన మరుగుదొడ్లు ,మంచినీటి సౌకర్యం ,ప్రహరి గోడలు వెంటనే కల్పించాలి అదేవిదంగా ప్రభూత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేసి విద్యారంగాన్ని ముందంజలో తిసుకేల్లలన్నారు. అదేవిధంగా ఉన్నత విద్యాధికారులు చొర్వా తీసుకోని ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివేక్ , శేఖర్, జుబెర్ , అజహర్ రజినీకాంత్,  జమీల్, అరవింద్ తదితరులు  పాల్గొన్నారు.




రైతులను ఇబంది పాలు చేస్తే చర్యలు తప్పవు - తహసీల్దార్

రైతులను ఇబంది పాలు చేస్తే చర్యలు తప్పవు - తహసీల్దార్ 





రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రైతులను ఇబంది పాలు చేస్తే చర్యలు తప్పవు ని రెబ్బెన  తహసీల్దార్ బండారు రమేష్ గౌడ్ బుధవారం కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు మండలంలో ఉన్న బ్యాంకు మేనేజర్లు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న రైతులను సంతకాల కోసం కార్యాలయాల చుట్టు త్రిప్పుతూ కాలయాపన చేస్తున్నారు. సబ్ కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల మేరకు రైతుల వద్ద టైటిల్ లీడ్ , పహాణీలు , పట్టా పుస్తకాలు ఉన్న యెడల రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని, సంతకాలు కావాలి అంటు రైతుల విలువైన సమయాన్ని వృధా చేయరాదన్నారు 

అక్రమంగా తరలిస్తున్న మొరం అధికారుల పరిశీలన

అక్రమంగా తరలిస్తున్న మొరం అధికారుల పరిశీలన 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో మానేపల్లి కుంట లో అక్రమంగా తరలిస్తున్న మొరంపై బుధవారం  ఇరిగేషన్ డి బి . రవీందర్ కుమార్ ఏ ఈ రాజు ఇరువురు  పరిశీలించారు అనంతరరం వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోలేటి గ్రామంలో మానేపల్లి కుంటనుండి మొరంను అక్రమంగా అమ్ముకోవడానికి అనుమతించిన సర్పంచ్ పై ఉన్నత అధికారులకు నివేదిక ఇస్తామన్నారు చెరువులో పడి ఆవులు , గేదలు , మనుష్యులు ఎవరైనా గాయాలపాలైతే దానికి పూర్తి బాధ్యత సర్పంచిదే అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెందర్ ఏవైటియుసి మండల కార్యదర్శి రాయిల్లా సర్సయ్య బిజెపి రాష్ట్ర కౌసిల్స్ సభ్యుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు

Tuesday, 21 June 2016

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో గోలేటిలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవము సందర్భంగా ఈ  నెల 17నుండి  శిక్షణ  తరగతులు ప్రారంబించి 21న ముగింపు కార్యక్రమం లో జియం కార్యాలయము నుండి టూ కె రన్ ప్రధాన రహదారుల గుండా సింగరేణి క్రీడా మైదానం వరకు పరుగులు తీశారు    బెల్లంపల్లి ఏరియా జనరల్  మేనేజర్ కె రవిశంకర్ మాట్లాడారు.   అందరు యోగతో సంపూర్ణ ఆరోగ్యమును మెరుగు పరచుకోవచ్చని, ఆరోగ్యవంతమైన సమాజం దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు అదేవిధంగా యోగ గురువులు శ్రీ కృష్ణ మూర్తి మాట్లాడుతూ రోగాలను దూరంచేసి ఏకైక మార్గం యోగ అని దీనిని ఉచితంగా నేర్చుకొని బాల , బాలికలు ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఉన్నత లక్షలను చేరాలని తెలిపారు . ఈ యోగ కార్యక్రమంలో శిక్షకురాలు శ్రీమతి దేవేంద్ర యోగ కార్యకర్తలు అస్.ఓ.టూ జీ.మ్ కొండయ్య,  పర్సనల్ మేనజేర్ సీతారం, డి వై. పి.ఎం.రాజేశ్వర్,  .ఐ.టి.యు.ఎస్.సి. నాయకులు తిరుపతి జి.ఎం.  కార్యాలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు. 

స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభం


స్మారక క్రికెట్ పోటీలు ప్రారంభం 






 (రెబ్బెన వుదయం  ప్రతినిధి) రెబ్బనలో మండల స్థాయి  క్రికెట్   క్రీడలను మంగళవారం ఎంపిపి  ప్రారంభించారు.  స్వర్గీయ బండారి ఫణికుమార్ స్మారక చిహ్నార్థం తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ అధ్యక్షతన ఎంపిపి సంజీవ్ కుమార్ , జెడ్ పి టి సి బాబురావు  మాట్లాడుతూ క్రీడాకారులు మరింతగా రాణించి ప్రతిభను కనబర్చాలని అన్నారు.స్వర్గీయ బండారి ఫణికుమార్ ఆత్మ శాంతిచాలని రెండు నిమిషాలు మౌనం పాటించి అనంతరం మాట్లాడారు యువకులు విద్యతో పాటు క్రీడా రంగంలో ఆశక్తి కనపరుస్తూ  మండలాన్ని ముందంజలో ఉండేలా చూడాలన్నారు. తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ క్రీడా యువకులలో నా కుమారున్ని చూసుకుంటుంన్నానని అలాగే పేద విద్యార్థులకు పీజులు కడుతూ చేయూతనిస్తున్నానని అన్నారు    ఈ కార్యక్రమములో సర్పంచు పెసరు వెంకటమ్మ , మార్కెట్ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ , ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , తూర్పుజిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ జైశ్వాల్ , చిరంజీవి , పాపయ్య , శాంతి  తదితర క్రీడా కారులు  పాల్గొన్నారు.

మరుగు దొడ్ల బిల్లులు చెల్లించంచండి ఏ ఐ వై ఎఫ్


మరుగు దొడ్ల బిల్లులు చెల్లించంచండి ఏ ఐ వై ఎఫ్ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములోని 12 గ్రామ పంచాయతీలో ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకున్నా అధికారులు బిల్లులు చెల్లించడము లేదని ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యాయుడు బోగే  ఉపేందర్ అన్నారు . సోమవారం స్థానిక తహశీల్ధార్ కార్యాలయములో డిప్యూటీ తహసీల్ధార్కు వినతి పత్రాన్ని ఇచ్చ్చారు అనంతరము మాట్లాడుతూ లబ్ది దారులు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాన్ని ప్రభుత్వ అధికారులు నీరుగారుస్తున్నారని తెలిపారు . గతం లో అప్పులు చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నా వారికి కూడా బిల్లులు రాలేదని అన్నారు ., గత 3 నెలలనుండి ఉపాధి హామీ కూలీలకు డబ్బులు రావడము లేదని , దీనితో కూలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు . మరుగు దొడ్ల బిల్లులు , ఉపాధి కూలీలు డబ్బులు వెంటనే చెల్లించే విదంగా సంబంచిన అధికారులు చూడాలని ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో నాయకులు రాయిలా నర్సయ్య , నీలగిరి రాజు , రామడుగుల శంకర్ లు ఉన్నారు .  .  




అక్రమంగా మొరంను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

అక్రమంగా మొరంను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); అక్రమంగా మొరంను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాద్యక్షుడు బోగేఉపేందర్ భాజపా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేసరి ఆంజనేయులు గౌడ్ ఏ ఐ టి యు సి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్యలు ఆదివారం రెబ్బెన మండలం గోలేటిలోని మానెపల్లికుంట సమీపంనుంచి గోలేటిలోని సింగరేణి రోడ్డుకు ఏలాంటి అనుమతి లేకుండా మట్టిని రవాణా చేస్తుండగా ట్రాక్టర్లను ఒక ఫోక్లియినర్ ను అడ్డుకోవడం జరిగిందన్నారు సంబంధిత గుత్తేదారు రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా గ్రామ పంచాయతి   ప్రతినిధులతో కుమ్మకై అక్రమాలకు పాలుపడుతున్నరని అన్నారు ఇప్పటికై ఉన్నత అధికారులు చొరవ తీసికొని అక్రమరవాణాను అరికట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు

రోడ్డు ప్రమాదం లో బాలుడి మృతి

రోడ్డు ప్రమాదం లో బాలుడి మృతి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రం లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం లో మంచిర్యాల కు చెందిన ఎండి . యూనుస్  మృతి చెందాడు. రెబ్బెన ఎస్ ఐ దారం సురేష్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల కు చెందిన ఖాలిద్ కుటుంబ సభ్యులతో శనివారం కాగజ్ నగర్ బంధువుల ఇంటికి ఇఫ్తార్ విందుకు హాజరు కావడం జరిగింది రాత్రి అక్కడే పడుకుని తెల్లవారుజామున తన కుమారుడు ఎండి . యూనుస్ [6సం ] తో ఆటో ట్రాలీ లో ఏ పి 01డబ్లు  9409 మంచిర్యాల బయలు దేరడం జరిగింది రెబ్బెన బస్టాండ్ దాటి కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుకగా వచ్చిన లారీ ఏ పి 07టి సి  6219 వేగంగా ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది ప్రయాణిస్తున్న బాలుడికి తల ,చాతి  లో తీవ్ర గాయాలు కాగా బెల్లంపల్లి లోని చికిత్స కేంద్రానికి తరలించారు బాలుని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలపడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రెబ్బెన ఎస్ ఐ   దారం సురేష్ తెలిపారు.

Sunday, 19 June 2016

జాగృతి యూత్ పెడరెషన్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ వెస్ చెర్మన్ కు ఘన సన్మానం

జాగృతి యూత్ పెడరెషన్ ఆధ్వర్యంలో మార్కెటింగ్ వెస్ చెర్మన్ కు ఘన  సన్మానం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల తెలంగాణా జాగృతి యూత్ పెడరెషన్ వారి ఆధ్వర్యంలో శనివారం  అతిది గ్రూహంలో నూతనంగా ఎంపిక అయినా ఆసిఫాబాద్ మార్కెటింగ్ వెస్ చెర్మన్ కుందారపు శంకరమ్మ ను మరియు మార్కెటింగ్ డైరెక్టర్  పల్లె రాజేశ్వరరావ్ ను  ఘనంగా సన్మానించారు అనంతరం ఆసిఫాబాద్ మార్కెటింగ్ వెస్ చెర్మన్ కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ ప్రజలకు చేసిన సేవను గుర్తించి వెస్ చెర్మన్ పదవిని ఇచ్చారు దానికి కృతజ్ఞతగా రైతు సమస్యలను పరిష్కరిస్తానని పండిచిన పంటలపై గిట్టుబాటు ధరలను అందిచేవిధంగా కృషిచేస్తామన్నారు తెలంగాణా జాగృతి యూవకులు మండలంలోని ఉత్సవంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు ఈ సమావేశంలో సర్పంచ్ పెసరు వెంకటమ్మ , ఉపసర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్ , మాజి జెడ్పిటిసి దుర్గం సోమయ్య ,సింగిల్విండో డైరెక్టర్ గజ్జల సత్యానారాయణ,జాగృతి తూర్పు జిల్లా  యూత్ కో కన్వీనర్ రంగు మహేష్ గౌడ్  మండల అధ్యక్షులు ఆవడపు గోపి నాయకులు వెంకన్న ,వినయ్ ,భీమేష్ ,నవీన్ ,సత్యనారాయణ, కే రాజాగౌడ్ ,చంద్రమౌళి తదితరులు పాల్గొన్నరూ .  

ప్రభూత్వ పాఠశాల భవనాలు నిర్మాణాలపై అవినీతికి పాలుపడుతున్నా కాంట్రాక్టర్లు

ప్రభూత్వ పాఠశాల భవనాలు నిర్మాణాలపై  అవినీతికి పాలుపడుతున్నా కాంట్రాక్టర్లు 




రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని యంపీ యుపిఎస్ ప్రభూత్వ పాఠశాలలకు మంజూరైన ఆదానవు గదుల నిర్మాణపు కాంట్రాక్టర్లు లు అవినీతికి పాలుపడుతున్నారని అఖిల భారత ప్రజా తంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలేటి నాగేష్ ఒక పత్రిక ప్రకటన లో తెలిపారు భవనాలు మే నెలలో పూర్తి చేయాల్సి ఉండగా రాజకీయ నాయకుల అండదండలతో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాలుపడడం వలన నిర్మాణం పనులు ప్రారంభంలోనే ఆగిపోయాయని నిధులు మంజూరైన కూడా నిర్లక్ష ధోరణితో పనులను ఆపివేయడం తో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు . అక్రమ కాంట్రాక్టర్ల లైసెన్స్ లు రద్దుచేయాలని కోరారు . ఒకప్రక్క బడిబాట కార్యక్రమాలు చేపడుతున్న అధికారులు ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులపై దృష్టి కేంద్రికరించి విద్యార్థుల సమష్యలను పరిష్కరించాలని అఖిల భారత ప్రజా తంత్ర విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోలేటి నాగేష్ డిమాండ్ చేశారు 

రెండవ రోజుకు చేరిన యోగా శిక్షణ తరగతులు

రెండవ రోజుకు చేరిన యోగా శిక్షణ తరగతులు

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సింగరేణి పాఠశాల రెబ్బెన మండలంలో గోలేటిలో యోగా అంతర్జాతీయ దినోత్సవము సందర్భంగా శిక్షణ తరగతులు శనివారానికి రెండవ రోజు చేరుకున్నాయి  ఈ కార్యక్రమమునకు  బెల్లంపల్లి ఏరియా జనరల్  మేనేజర్ కె రవిశంకర్ విచ్చేసి విద్యార్థిని విద్యార్థులు అందరు యోగ శిక్షణ తరగతులకు హాజరై ఆరోగ్యమును మెరుగు పరచుకోవాలన్నారు ఆరోగ్యవంతమైన సమాజం దేశ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు అదేవిధంగా యోగ గురువులు శ్రీ కృష్ణ మూర్తి మాట్లాడుతూ రోగాలను దూరంచేసి ఏకైక మార్గం యోగ అని దీనిని ఉచితంగా నేర్చుకొని బాల , బాలికలు ఆరోగ్యాన్ని పొందాలని ఆరోగ్యమే మహాభాగ్యమని ఉన్నత లక్షలను చేరాలని తెలిపారు . ఈ యోగ కార్యక్రమంలో శిక్షకురాలు శ్రీమతి దేవేంద్ర యోగ కార్యకర్తలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Saturday, 18 June 2016

సింగరేణి విద్యా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు

సింగరేణి  విద్యా  సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగరేణి  విద్యా  సంస్థల్లో విద్యా బోధన కొరకు కాంట్రాక్ట్ బేసిక్ పై మరియు నాన్ టీచింగ్ ఉద్యోగ అవకాశాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని డిజిఎం పర్సనల్ జె . చిత్రంజన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు సింగరేణి ఏరియాలోని విద్యా సంస్థల్లో 49 ఉపాధ్యాయుల ఉద్యోగ అవకాశాలు నాన్ టీచింగ్ ఉద్యోగాలు 31, కొత్తగూడం సింగరేణి డిగ్రీ కళాశాలలో మరియు మహిళా డిగ్రీ కళాశాలలో ,పాల్ టెక్నీక్ కళాశాల , సీసీసీ , నస్పూర్ , ఆదిలాబాద్ మరియు అన్ని ఏరియాలోని సింగరేణి హైస్కూళ్లలో పని చేయుటకు ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ వెబ్ సైట్ లో ఈ నెల 30వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు .

Friday, 17 June 2016

ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలి

ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలని మత్స సహకార సంఘం చైర్మెన్ పోలు  లక్మన్  ముదిరాజ్ అన్నారు శుక్రవారం రెబ్బెన మండలంలోని అతిధి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం   ముదిరాజ్ లను బి సి -ఏ లో చేర్చాలని  అన్నారు   మత్స కారులకు సబ్సిడీ రుణ సదుపాయం,భీమా పథకం వర్తిస్తుంది అని అన్నారు ఉపాధి పనులు కల్పించాలని అన్నారు మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో చేపల పెంపకాన్ని పెంచవచ్చు అని, ముదిరాజ్ సంఘం ద్వారా ఉపాధి పొందవచ్చునని అన్నారు రెబ్బెన లో  ముదిరాజ్ నూతన కమిటీ ఏర్పాటు చేశారు   ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజమల్లు ముదిరాజ్ ,రెబ్బెన మండల అధ్యక్షుడు పెసారు మధునయ్య ముదిరాజ్ ,కార్యదర్శి పిల్లి మధు ముదిరాజ్ ,చిత్రగుప్తుడు, కాలివేణి రాజెందర్ ముదిరాజ్, సర్పంచ్ పెసారు వెంకటమ్మ ముదిరాజ్,మూడెడ్ల శ్రీనివాస్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా యోగా శిక్షణ తరగతులు

అంతర్జాతీయ యోగా దినోత్సవం  సందర్బంగా యోగా శిక్షణ తరగతులు 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సింగేరేణి సి ఎం డి శ్రీధర్ ఆదేశాల మేరకు ఈనెల 17 నుండి 20 వరకు జరుగు యోగా తరగతులలో ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని రెబ్బెన మండలం గోలేటి జిఎమ్  కార్యాలయం లో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ తరగతుల  జిఎమ్ రవిశంకర్ పాల్గొని  మాట్లాడారు   ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా బెల్లంపల్లి డివిజన్ లోని అన్ని గనులలో ,పాఠశాలలలో ,కార్యాలయలలో డోర్లీ -1, డోర్లీ-2 ఉపరితలగనులలో  యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ శిక్షణ ద్వారా కార్మిక కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యోగా శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం కొండయ్య ,డి వై పి ఎం పర్సొనల్  చిత్రాంజన్  ,రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు  

విద్యుత్ పరికరంలో రాగి తీగలు చోరి

విద్యుత్ పరికరంలో రాగి తీగలు చోరి 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లోని నంబాల వాగు ఒడ్డున విద్యుత్ ట్రాన్స్ ఫారంలో  రాగి తీగలను బుదవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగి లిం చారని రైతులు   గంధార్ల శంకర్ ,హనుమయ్య ,దుర్గం లోకాజి ల పిరియాదు మెరకు 2012 సం లో ఇం ద్ర జల పథకంలో నిరుపేద రైతులకు 13ఎకరాల సాగుకై ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫారం లో చోరి జరిగిందని భాదిత రైతుల పిరియాదు మెరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని యస్ ఐ టివి రావు తెలిపారు .

పాటశాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి - దుర్గం రవీందర్

పాటశాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి - దుర్గం రవీందర్


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రాష్ర్ట వ్యాప్తతంగా ఉన్న ప్రభూత్వ పాటశాల లో కనీస సౌకార్యాలు లేకపోవడంతో విద్యార్ధులు తివ్ర  ఇబ్బందులకు గురి అవుతున్నారని ఎ ఐ యస్ యఫ్ రాష్ట్ర కమిటి పిలుపు మెరకు  జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ రెబ్బెన తహసిల్దార్ కార్యాలయంలో డి టి రాంమోహన్ రావు కు వినతి పత్రం అంద జేశారు అనంతరం మాట్లాడుతూ పాటశాలలో కనీస వసతులు ఐన మరుగుదొడ్లు ,మంచినీటి సౌకర్యం ,ప్రహరి గోడలు వెంటనే కల్పించాలి అదేవిదంగా ప్రభూత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వాలు కృషి చేసి విద్యారంగాన్ని ముందంజలో తిసుకేల్లలన్నారు అలాగే ప్రభూత్వ పాటశాలలో ఆంగ్ల విద్యా భోధన ను అమలు పరచాలని అన్నారు రోజురోజుకు ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలు ఎక్కువై పాటశాలలో కనీస సౌకర్యాలు కల్పించ కుండ విద్యార్దుల తలిదండ్రుల వద్ద నుండి వేల లాది రూపాయలు దండు కుంటు నిబందనకు విరుద్దంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేసుకొని  పాట్య పుస్తకాలు ను అమ్ముతూ విధ్యాను వ్యాపారంగా మారుస్తున్నారని అన్నారు నిబందనలకు విరుద్ధంగా వ్యహరిం చె పాటశాలల పై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పుదరి సాయి ,మైపాల్ ,తిరుపతి ,రాజకుమార్ ,కిషోర్ తదితరాలు పాల్గొన్నారు . 

Thursday, 16 June 2016

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); 44 రోజులు పంచాయితీ కార్మికులు సమ్మెబాట పట్టినప్పుడు ప్రబుత్వం దిగి వచ్చి  సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నప్పటికీ నెరవేర్చలేదని తెలంగాణ గ్రామా పంచాయితీ వర్కర్స్ అండ్ ఉద్యోగులు యూనియన్ జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ అన్నారు  గ్రామా పంచాయితీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం రోజున రెబ్బెన  మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఎం పి డి ఓ లక్ష్మి నారాయణ కు వినతి పత్రం అందచేసారు  అనంతరం జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ మాట్లాడుతూ గతం లో 44 రోజులు పంచాయితీ కార్మికులు సమ్మెబాట పట్టినప్పుడు ప్రబుత్వం దిగి వచ్చి మే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నప్పటికీ నేటి వరకు అమలు పర్చలేదన్నారు ప్రబుత్వం హామీ ఇచ్చి 10 నెలలు గడిచిన ఎ ఒక్క సమస్య పరిష్కరించకుండా కాలయాపన గ చేస్తుంది పంచాయితీ కార్మికులు ఎదురుకుంటున్న సమస్యలు పై జిల్లా నిరాహార దీక్షలు చేపడతామన్నారు కాంట్రాక్టు కార్మికుల క్రమ బద్దికరణలో భాగంగా   గ్రామా పంచాయితీలో పని చేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలనీ వేతనాలు పెంచాలని లేకపోతె జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ప్రబుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో  తెలంగాణ గ్రామా పంచాయితీ వర్కర్స్ అండ్ ఏమ్ప్లోయ్స్ యూనియన్ మండల అద్యక్షుడు జి . ప్రకాష్  కార్యదర్శి కే . తిరుపతి నాయకులూ ధర్మయ్య అన్నాజీ సంతోష్ తదతరులు పొల్గొన్నరు 

పిల్లలచే ఓనమాలు దిద్దించిన ఎమ్ఇఓ


పిల్లలచే ఓనమాలు దిద్దించిన  ఎమ్ఇఓ 

రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం లేతనగూడ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఎం ఈ ఓ వెంకటేశ్వర స్వామి  చిన్న పిల్లలకు  అక్షర బ్యాసం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలని చిన్న తనం నుంచే ప్రతి రోజు పాశాలలకు పంపుతూ విద్యపై ఆకర్షితులు అయ్యేలా చూడాలి అని అన్నారు అలానే ఈ కార్యక్రమంలో ఎచ్ ఎం రవికుమార్  పాశాల ఉపాద్యాయులు కలిసి పిల్లలకి పలకలు, బలపాలు ఉచితముగా పంపిణి చేసి పిల్లలచే ఓనమాలు దిద్దించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు  

Tuesday, 14 June 2016

అధికారులు చిత్త శుద్దితో పని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యం- ఎంఎల్ సి


      అధికారులు చిత్త శుద్దితో పని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యం- ఎంఎల్ సి 




రెబ్బెన: (వుదయం ప్రతినిధి);  అధికారులు ప్రజా ప్రతినిధులు వారివారి విదులలలో విధి నిర్వహణ చిత్త శుద్దితో పని చేస్తే బంగారు తెలంగాణ సాధ్యం అని ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్  అన్నారు రెబ్బెన మండలంలో ఎం పి  డి ఓ కార్యాలయంలో  ఎం పి పి సంజీవ్ కుమార్ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసినా సర్వ సభ్యసమావేశంలో  ముఖ్య అతిధిగా ఎం ఎల్ సి  పురాణం సతీష్ కుమార్,  ఎం ఎల్ ఎ  కోవ లక్ష్మి సమావేశంలో మాట్లాడరు. అన్ని శాఖల అధికారుల అబివృద్ది పనులపై చర్చలు జరిపి సంక్షేమ పథకలను ప్రజలకు జారి చేసి వాటిని సక్రముగా ప్రజలకు అందేలా చూడాలని అధికారులను కోరారు ముఖ్యంగా విద్య, ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలని, రానున్న వర్షాకాలం దృష్టిలో వుంచుకొని అధికారులు వారి యొక్క పరి సరాలలో  పరిశుద్ధం లేకుండా చూడాలి నీళ్ళు  కాలుషితం కాకుండా చూడాలి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా విద్య రంగంలో   100 % ముందంజ లో వుండాలని ప్రతి ఒక్క పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులపై శ్రద్ధ చూపి ముందంజ లో ఉత్తిర్ణ స్తాయిని పెంచాలని అ శాఖ అధికారులకు అదేశలను జారి చేసారు రైతులకు సకాలంలో ఎరువులు ,విత్తనాలు అందచేయాలి అన్నారు మరియు హరిత హారం  కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చెట్లను నాటేల చూడాలని,అన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన షాదీ ముభారాక్,కళ్యాణి లక్ష్మి,మిషన్ కాకతీయ,పించన్ వంటి పథకాలు  అర్హులైన వారికీ సక్రమంగాఅందేలా చూడాలని,స్వచ్చ బారత్ లో బాగముగా ప్రతి ఇంటికి మరుగు దొడ్డి నిర్మించాలి మన ఊరు మన ప్రణాళిక ఆదరముగా మన రాష్ట్రము చేపట్టిన సంక్షేమ పతకాలను ప్రజలకు ప్రవేశ పెడుతూ మన ముఖ్య మంత్రి కె చంద్రశేఖర్  రావు అధికరులతో స్నేహ భావంతోఫ్రెండ్లీ  గవర్నమెంట్ సంక్షేమ పథకాలను జారి చేస్తున్నాయి రానున్న భావి తరాలలో బంగారు తెలంగాణ పాలన ఎకదాటిగా కొనసాగుతుంది అని అన్నారు. ఈ సర్వ సభ్య సమావేశము  ఉదయం 11.30ని "జరగాల్సి ఉండగా సాయంత్రం ప్రారంభం కావడంతో  కొంత మంది ప్రజా ప్రతినిధులు వేనుదిరుగాడంతో సదవుగా ముగిసింది.   ఈ సభలో   జ డ్ పి టి సి  బాబురావు, వైస్ ఎం పి పి  గోడిసేలా రేణుక,  తహసిల్దార్ రమేష గౌడ్ ,ఎం పి డి ఓ లక్ష్మినరయణ, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటి చేర్ మేన్ గందం శ్రీనివాస్,ఎం ఇ ఓ వెంకటేశ్వర స్వామి,   ఎ పి ఎమ్ రాజ్ కుమార్,వెంకటరమణ ఎ ఓ మంజుల, ఎ పి ఓ కల్పనా,సి డి పి ఓ మమత ,ఈ ఓ పి అర్ డి కిరణ్ ,అర్ డబ్లు జె ఎస్ సోని,రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ,వివిధ  గ్రామాల సర్పంచులు ఎం పి టి సి లు అధికారులు పాల్గొన్నారు 

Monday, 13 June 2016

మార్కెట్ కమిటి వై ఎస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ


ప్రైవేటువిద్య సంస్తల్లో అధిక ఫీజులు నియంత్రించాలి -దుర్గం భరద్వాజ్

ప్రైవేటువిద్య సంస్తల్లో అధిక ఫీజులు నియంత్రించాలి -దుర్గం భరద్వాజ్
(రెబ్బెన వుదయం ప్రతినిధి) కార్పొరేట్ ( ప్రైవేటు) విద్య సంస్తలల్లో అధిక ఫీజులు వాసులు చేస్తున్న   యజమన్యలపై క్రిమినల్ కేసులు నమోదు చెయలని ఎన్ ఎస్ యు ఐ   జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్  అన్నారు. రెబ్బెన మండలంలో సోమవారం  వసతి గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన   మాట్లాడుతూ రాష్ట్ర ప్రబుత్వం ప్రి ప్రైమరీ తరగతులకు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జరిచేసినప్పటికి జిల్లా లో ఇప్పటి వరకు చాల పాటశాలలు అనుమతి తీసుకోకుండా వ్యవహరిస్తున్నరని అన్నారు కనీస వసతులు కల్పించకుండా అర్హత కలిగిన ఉపాద్యాయులను నియమించకుండ ధనర్భానే ద్యేయంగా ప్రైవేటు విద్యాసంస్తల యజామాన్యాలు వ్యవహరిస్తున్నారని  అధిక ఫీజులు వాసులు చేస్తున్నారని ఎన్నికల ప్రచారం లాగా వాసులు చేస్తున్నారని అన్నారు జిల్లాలో చాల  పాటశాలలు స్వంత భావనలు లేవని షాపింగ్ చొమ్ప్లెక్ష్లలొ కొనసాగిస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రబుత్వానికి చిత్తశుద్ది ఉంటె అనుమతి లేకుండా కనీస వసతులు లేకుండా నిర్వహిస్తున్న యజామాన్యలపై క్రిమినల్  కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేసారు   ఈ కార్యక్రమంలో  ఎన్ ఎస్ యు ఐ    అద్యక్షుడు సంజీవ్  నాయకులూ జుబెద్ ,ముజ్జ ,సాయి వికాస్,అజ్మీర వివేక్   తదితరులు పాల్గొన్నారు.

జె ఇ ఇ అడ్వాన్సు ఎంట్రన్స్ లో ప్రతిభ కనబరచిన రెబ్బెన విద్యార్ధి

జె ఇ ఇ  అడ్వాన్సు ఎంట్రన్స్ లో ప్రతిభ కనబరచిన రెబ్బెన విద్యార్ధి 


(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన కు చెందినా కే . సాయి సచిన్ హర్ష వర్ధన్  జె ఇ ఇ  అడ్వాన్సు ఎంట్రన్స్ పరీక్షలో అల్ ఇండియా స్తాయి లో 3722 ర్యాంక్ రిజర్వేషన్ కోటలో  49 వ ర్యాంక్ సాదించడం  జరిగింది తల్లిదండ్రులు కే . శ్రీనివాస్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రెబ్బెన డాక్టర్ అజ్మత్ ఫిసికల్  డైరెక్టర్ పదవ తరగతిలో 9. 9 జి పి ఎ  ఇంటర్92%  మొదటి నుండి విద్యలో చురుకుదనం ఉండి   జె ఇ ఇ  అడ్వాన్సు లో కూడా మంచి ర్యాంక్  సాదించడం పట్ల డి ఎఫ్ ఓ వెంకటేశ్వర్లు ,రేంజ్ ఆఫీసర్ వినయ్ కుమార్ , సిఐడి డిఎస్పి రవికుమార్ ఫారెస్ట్ అధికారుల సంఘం నాయకుడు ప్రభాకర్ ఆలీఖాన్ అటవీ శాఖ సిబ్బంది అభినందనలు తెలిపారు  

అనుమతిలేని పాటశాలలపై చర్యలు తీసుకోవాలి -దుర్గం రవీందర్

అనుమతిలేని  పాటశాలలపై చర్యలు తీసుకోవాలి -దుర్గం రవీందర్ 


(రెబ్బెన వుదయం ప్రతినిధి) జిల్లా వ్యాప్తంగా వున్నా ప్రైవేటు విద్య సంస్తలల్లో అనుమతి లేని పాటశాలల యజమన్యలపై క్రిమినల్ కేసులు నమోదు చెయలని ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి లో   కే ఎల్ మహేంద్ర భవన్ లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన   మాట్లాడుతూ రాష్ట్ర ప్రబుత్వం ప్రి ప్రైమరీ తరగతులకు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జరిచేసినప్పటికి జిల్లా లో ఇప్పటి వరకు చాల పాటశాలలు అనుమతి తీసుకోకుండా వ్యవహరిస్తున్నరనిన్ అన్నారు ప్రి ప్రైమరీ తరగతులు నర్సరి -ఎల్ కే జి,యు కే జి లకు 5000 నుండి 12000 వరకు ఫీజులు తీసుకుంటూ విద్యర్తులను వారి తల్లితండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు కనీస వసతులు కల్పించకుండా అర్హత కలిగిన ఉపాద్యాయులను నియమించకుండ ధనర్భానే ద్యేయంగా ప్రైవేటు విద్యాసంస్తల యజామాన్యాలు వ్యవహరిస్తున్నారని అన్నారు జిల్లాలో చాల  పాటశాలలు స్వంత భావనలు లేవని షాపింగ్ చొమ్ప్లెక్ష్లలొ కొనసాగిస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రబుత్వానికి చిత్తశుద్ది ఉంటె అనుమతి లేకుండా కనీస వసతులు లేకుండా నిర్వహిస్తున్న యజామాన్యలపై  కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేసారు ప్రి ప్రైమరీ తరగతులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న  పాటశాలల  ముందు ఎ ఐ ఎస్ ఎఫ్ అద్వర్యం లో ధర్నాలు నిర్వహిస్తామని దీనికి పూర్తీ బాద్యత విద్యశాఖ  అధికారులే వహించాలని అన్నారు  ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎస్ ఎఫ్ అద్యక్షుడు కస్తూరి రవి కార్యదర్శి పుదరి  సాయి నాయకులూ శేకర్ మహిపాల్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Sunday, 12 June 2016

మార్కేట్ వైస్ ప్రెసిడెంట్ గా కుందారపు శంకరమ్మ

 మార్కేట్ వైస్ ప్రెసిడెంట్ గా కుందారపు శంకరమ్మ 


(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణా  రాష్ట్ర ప్రభుత్వం జారి చేసిన ఉత్తర్వులలో వైస్ చైర్మన్ గా రెబ్బెన మండలానికి  చెందినా కుందారపు శంకరమ్మ ఎన్నికయ్యారు.2002లో సి పి ఐ పార్టీ లోంచి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమాలలో పాల్గొని కీలకపాత్ర పోషించారు.2002 నుంచి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శిగా కొనసాగుతూ 2008లో తూర్పు జిల్లా మహిళా ప్రధాన  కార్యదర్శిగా నియామకం అయ్యారు.బి సి కులసంఘం లో జిల్లా మహిళా ఉపద్యాక్షురాలుగా కొనసాగుతూ పేద ప్రజలకు సంక్షేమ పతకాలను తెలియ జేస్తూ చేదోడు వాదోడు గా పనిచేస్తున్నారు.కుందారపు శంకరమ్మ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం కోసం చురుకుగా పనిచేస్తున్నందుకు  గుర్తించి మార్కేట్ వైస్ ప్రెసిడెంట్ గా పదవిని ప్రకటించడం ఎంతో సంతోషకరమని అన్నారు.ఈ సందర్భంగా  .యంఎల్ఎ కోవాలక్ష్మి, యం యల్ సి పురాణం సతీష్ ,మంత్రులకు మరియు కె సి ఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

సాదా బైనామలను ఉచిత భూ పట్టాలు చేసుకోండి

సాదా బైనామలను   ఉచిత భూ పట్టాలు చేసుకోండి

(రెబ్బెన వుదయం ప్రతినిధి)సాధబైయన ద్వారా 5ఎకరాలభూమి రైతులు  ఉచిత భూ పట్టాలు చేసుకోవాలని ఎం పి పి సంజీవ్ కుమార్, జడ్ పి టి సి అజ్మీర బాబురావు, తాహసిల్దార్ బండారి రమేష్ గౌడ్  కోరారు. రెబ్బెన ఎం పి డి ఓ కార్యాలయంలో మాట్లాడురు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సాధబైయన ద్వారా 5ఎకరాలభూమి రైతులు  ఉచిత భూ పట్టాలు 2-06-2014  లోపల సాధబైనమ ద్వారా 5ఎకరాల భూమి కొనుగోలు చేసినవారు  రైతులకు ఉచిత భూ పట్టాలు కొరకు  జూన్ 15వ తేది లోపు  మీ సేవలలో ధరకాస్తు చేసుకోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వై స్ ఎం పి పి రేణుక,సింగల్ విండో చైర్మన్ గాజుల రవీందర్, ,సర్పంచులు ,వి అర్ వో లు ,ఎం పి టి సి లు వివిధ శాఖల  అధికారులు పాల్గొన్నారు

14న సర్వసభ సమావేశం

14న  సర్వసభ సమావేశం 

(రెబ్బెన వుదయం ప్రతినిధి);;  రెబ్బెన మండల కేంద్రంలోని ఎం పి  డి ఓ కార్యాలయం లో ఈ నెల 14వ తేదిన ఉదయం 11;30 నిర్వహించబోయే  సర్వసభ సమావేశానికి ఆయ శాఖల అధికారులు  ప్రజా ప్రతినిధులు  సకాలంలో హాజరు కావాలని ఇంచార్జ్ ఎం పి  డి ఓ  అర్ . లక్ష్మి నారాయణ కోరారు  

జె ఎం బి గిరిజన సేవ సంఘం డివిజన్ కార్యవర్గం ఎన్నిక

జె ఎం బి గిరిజన సేవ సంఘం  డివిజన్  కార్యవర్గం ఎన్నిక


(రెబ్బెన వుదయం ప్రతినిధి);;  జె ఎం బి గిరిజన సేవ సంఘం వారు  డివిజన్  కార్యవర్గం ఎన్నుకున్నట్లు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భుక్య రాంబాబు నాయక్ తెలిపారు.   డివిజన్ కమిటీ కన్వినర్ గా చౌహాన్ సంతోష్,  కో కన్వినర్ గా బానోత్ తిరుపతిలను ఎన్నుకున్నారు అనంతరం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భుక్య రాంబాబు నాయక్  మాట్లాడుతూ సంప్రదాయాల ప్రకారం గిరిజన గ్రామలలో గ్రామా దేవతలకు పూజలు చేసే పూజారులకు కనీస వేతనం 3000 ఇవ్వాలని డిమాండ్ చేసారు. గ్రామ పురాతన సంప్రదాయాలను కాపాడుతూ గిరిజన వునికకిని చాటిచెప్పాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో సేవ సంఘం నాయకులూ కిరణ్ గణేష్ వినోద్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు 

సింగరేణి సేవాసమితి వారి ఆద్వర్యం లోవృత్తి కోర్సులు

సింగరేణి సేవాసమితి  వారి ఆద్వర్యం లోవృత్తి కోర్సులు


(రెబ్బెన వుదయం ప్రతినిధి);;  బెల్లంపల్లి ఏరియా సింగరేణి సేవాసమితి  వారి ఆద్వర్యం లోవృత్తి కోర్సులు కార్మికుల కుటుంభాలకోసం శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డి జి ఎం పర్శనల్ జె చిత్తరంజన్ కుమార్ ప్రకటనలో తెలిపారు. గోలేటి, మాదారంలో  టైలరింగ్ , బ్యుటిసియన్  కోర్సులు ,కంప్యూటర్ కోర్సులు ,ఫాస్ట్ ఫుడ్ మరియు క్యాటరింగ్ శిక్షణ లను వాటి కాలపరిమితులను పట్టి ఆశక్తి గల కర్మిలకుల కుటుంబ సబ్యులు ఈ నేల 20తేది లోపు జీఎం పర్సనల్ కార్యలయలం లో దరఖాస్తు లు చేసుకోవాలని కోరారు.

Thursday, 9 June 2016

నూతన పైపు లైనుకు శంకుస్థాపన

నూతన పైపు లైనుకు శంకుస్థాప


(రెబ్బెన వుదయం ప్రతినిధి);; రెబ్బెన గ్రామ పంచాయితీలోని మొదటి వార్డు మేదరి వాడలో  నీటి పైపు లైను నిర్మాణ పనులను గురువారం జడ్పిటిసి బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి ఎద్దడిని పునరుద్ధరించాలని మంచినీటి పైపులైను కోసం 3 లక్షలు మంజూరు అయినట్లు, ఆ నిధుల ద్వారా గ్రామ పంచాయితీలో మంచినీటి కొరత తీరనుందని అన్నారు. ఈ కార్యాలయంలో వైస్ ఎంపిపి గోడిసేలా రేణుక, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఆర్ ఎస్ డబ్లి జె ఈ సోనీ , పంచాయితి కార్యదర్శి రవీందర్ వార్డు సభ్యులు చిరంజీవి, భరద్వాజ్, సత్తయ్య  కాలని వాసులు పాల్గొన్నారు.

ప్రేమ పేరుతో వేధిస్తున్నా యువకు డు అరెస్ట్

ప్రేమ పేరుతో వేధిస్తున్నా యువకు డు అరెస్ట్


(రెబ్బెన వుదయం ప్రతినిధి);;  ప్రేమ పేరుతో గత కొంత కాలంగా చరవాణిలో అసభ్యకరమైన పదజాలంతో సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడని యువతీ ఫిర్యాదు చేసిందని ఎస్సై టీవీ రావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రెబ్బెన మండలంలోని తుంగేడ గ్రామానికి చెందిన మాదాసు కమలాకర్ రెబ్బెనకు చెందిన యువతీ యొక్క అన్నతో గత కొద్ది కాలంగా స్నేహం పెంచుకొని తన సోదరిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో చరవాణిలో అసభ్యకరమైన పదజాలంతో సందేశాలు పంపుతూ తనను ప్రేమించానంటూ మానసికంగా వేధిస్తున్నాడని యువతీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గురువారం కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

Wednesday, 8 June 2016

ప్రభుత్వ బడులె ముద్దు - ప్రైవేటు స్కూళ్ళు మాకొద్దు

ప్రభుత్వ బడులె  ముద్దు - ప్రైవేటు స్కూళ్ళు మాకొద్దు


 (రెబ్బెన వుదయం ప్రతినిధి) ప్రబుత్వం పాటశాల పటిష్టం చేయడానికి ప్రబుత్వం చేపట్టిన ప్రొప్రెశర్ జయ శంకర  బడి బాట కారేక్రమం మోడో రోజు మంగళవారం రెబ్బెన మండలం లోని ఇందిరా నగర్ లో నిర్వహించ్సారు , ఈ సందర్భంగా రోడ్ల పై నినాదాలు చేస్తూ ర్యాలి నిర్వహించారు .  ప్రైవేటు స్కూల్ లో పిల్లలను చేర్పించోదని ప్రబుత్వ పాటశాలలో చేర్పించాలని ప్రబుత్వ పాటశాలలో  చదువుకున్న విద్యార్దులకు ఉద్యోగావకశాలతో పాటు మెరుగైన విద్యనూ అందిస్తామని  ఏర్పాటు చేసిన బడిబాట సదస్సు లో ఎమ్. పీ.పీ సంజీవ్ కుమార్, తహసిల్దార్ రమేష్ గౌడ్  అవగాహన కల్పించారు. ఈ సదస్సు లో సర్పంచ్ పెసర వెంకటమ్మ , ఎహ్ ఎం రవికుమార్ , తిరుపతి గౌడ్ , అనిత ,   తదితరులు పాల్గొనారు.

సబ్సిడీ పై విత్తనాలు తీసుకెళ్ళండి -ఎ ఓ మంజుల

సబ్సిడీ పై విత్తనాలు తీసుకెళ్ళండి  -ఎ ఓ  మంజుల 

 (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని రైతులు సబ్సిడీ పై విత్తనాలను తీసుకెళ్లాలని ఎ ఓ మంజుల అన్నారు . మండల కేంద్రములోని  సహకార కేంద్రములో కందులు , పెసర , మినుము విత్తనాలు 50 శాతము సబ్సిడీ పై ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని , కావాల్సిన రైతులు వెంటనే తీసుకెళ్లాలని ఆమె అన్నారు . 

బడి బాట గురించి అవగాహనా సదస్సు

                                                                                                                                          బడి బాట గురించి  అవగాహనా సదస్సు 

 (రెబ్బెన వుదయం ప్రతినిధి) బడి బాట అవగాహనా సదస్సు కల్పిస్తూ ప్రైవేటు స్కూల్ లో పిల్లలను చేర్పించోదని ప్రబుత్వ పాటశాలలో చేర్పించాలని ప్రబుత్వ పాటశాలలో  చదువుకున్న విద్యార్దులకు ఉద్యోగావకశాలతో పాటు మెరుగైన విద్యనూ అందిస్తామని రెబ్బెన మండలం లోని నౌగాం లో ఏర్పాటు చేసిన బడిబాట సదస్సు లో ఎమ్. పీ.పీ సంజీవ్ కుమార్, తహసిల్దార్ రమేష్ గౌడ్  అవగాహన కల్పించారు. ఈ సదస్సు లో ఎమ్. ఈ. ఓ  వెంకటేశ్వర స్వామి సర్పంచ్ మల్లికాంబ, దోమల పోచయ్య మరియు ప్రదానోపాద్యాయులు  తదితరులు పాల్గొనారు.