Tuesday, 5 December 2017

సింగరేణి కంపెనీ లెవెల్ అథ్లెటిక్ పోటీలు

 సింగరేణి కంపెనీ లెవెల్ అథ్లెటిక్ పోటీలు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 5 :  బెల్లంపల్లి ఏరియా గోలేటిలో డబ్ల్యూ పి ఎస్ అండ్ జి ఏ  ఆధ్వర్యంలో  ఈ నెల 7,8 వ తేదీలలో గోలేటి భీమన్న స్టేడియం గ్రౌండ్లో  జరిగే కంపెనీ లెవెల్ అథ్లెటిక్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను సింగరేణి జనరల్ మేనేజర్ కే రవిశంకర్ మంగళవారం   పరిశీలించారు.  ఈ సందర్బంగా గ్రౌండ్లో జరుగుతున్నా ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. పలు ఈవెంట్లలోపోటీలు జరుగుతున్నా సందర్భంగా అధికారులకు సూచనలు చేసారు. ఈవెంట్లో 11 ఆరేయాలనుండి  పాల్గొనే సుమారు 300 మంది క్రీడాకారులు, క్రీడాకారిణులు సంబంధించి వసతి ,భోజన సదుపాయాలను లోపాలు లేకుండా సిద్ధంచేయాలని అధికారులకు ఆదేశించారు. కంపెనీ స్థాయి పోటీలను ఘనంగా నిర్వహించడానికి సివిల్ మరియు వర్క్ షాప్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ తో పటు డిజైన్ పర్సనల్ జె  కిరణ్,   డబ్ల్యూ ఫై ఎస్ అండ్ జి ఏ ఏ  గౌరవ కార్యదర్శి రాజేశ్వర్ ,స్పోర్ట్స్  సూపర్ వైజర్ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment