కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 13 : సింగరేణి పాఠశాలలోని తెలుగు పండితురాలు శోభారాణిని టి ఆర్ ఎస్ వి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బుధవారం గోలేటి లో ప్రపంచ తెలుగు మహా సభలను పురస్కారించుకొని టి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు జల్లు శ్రీనివాసరావు పేలుపు మేరకు జిల్లా ప్రధానకార్యదర్శి మాలరాజ్ శ్రీనివాసరావు మరియు జిల్లా కోఆర్డినేటర్ మస్క రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మొట్ట మొదటిసారిగా ప్రపంచ తెలుగు మహా సభలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించుకోవడం గర్వకారణమన్నారు. మహాసభలను రాష్ట్ర ముఖ్యమంత్రి అంగరంగవైభవంగా నిర్వహించనున్నారని అన్నారు.తెలుగు భాషను మరియు తెలంగాణ సాంస్కృతిని ప్రపంచ నలుమూలల చాటే విదంగా తెలుగు మహాసభలను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మొర్లే నరేందర్, నాయకులు దుర్గం భరద్వాజ్ పార్వతి అశోక్ రాజ్ కుమార్ .రాజేందర్ తిరుపతి కళ్యాణ్ సునీల్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment