సేవా సంస్థ ఆధ్వర్యం దివ్యంగుల దినోత్సవ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 6 : అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవ సందర్భంగా బుధవారం రెబ్బెన మండల గోలేటి లోని బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అద్వర్యం లో (డి ఎం డి) ప్రత్యేక అవసరాల పిల్లల కేంద్రం పాఠశాలలో పిల్లలతో కేక్ కట్ చేయించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ అధ్యక్షులు ఒరగంటి రంజిత్ మాట్లాడుతూ దివ్యంగులని అందరితో సమానంగా చూడాలని ఎవరిని కూడా కించపరుస్తూ మాట్లాడరాదని కోరారు . దివ్యంగులలో కొంతమంది నడవలేని వారు గుడ్డి, మూగ, ఉంటారని వాళ్ళని కంటికి రెప్పలాకాపాడుకొనే తల్లి తండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి అంగ వైకల్యం అడ్డు రాదని అంగ వైకల్యం ఉందని బాదపడోద్దని మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. ప్రపంచం లో ఎంతోమంది దివ్యంగులు శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఎదిిగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్,అజయ్,,రవీందర్ కార్యదర్శులు ఏగ్గే తిరుపతి , రాకేష్, బలుగురి తిరుపతి మరియు పాఠశాల ఉపాధ్యాయురాళ్లు సుజాత,సౌజన్య,నికిత,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment