Saturday, 2 December 2017

కొమురంభీం జిల్లాను ప్రేత్యేక అభివృద్ధికై ఎంపిక : బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్

కొమురంభీం జిల్లాను ప్రేత్యేక అభివృద్ధికై ఎంపిక  : బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 : కొమరంభీం జిల్లాను కేంద్రప్రభుత్వం  వెనుకబడిన జిల్లాగా గుర్తించి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకుకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాతు శనివారం రెబ్బెన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన ఐదు జిల్లాలను  గుర్తించడం జరిగిందని  అందులో కొమురంభీం జిల్లా ను  కూడా ఎన్నిక  చేయడం జరిగిందని   ఆదివాసుల జిల్లాను గుర్తించడం హర్ష నియమని  కొమురంభీం జిల్లాను గుర్తించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియచేసారు.  కేంద్ర ప్రభుత్వం నుంచి వేరుగా గ్రామ పంచాయతీకి నిధులు వస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపం , ప్రజల అమాయకత్వంతో  గ్రామాల అభివృద్ధికి అందనంత దూరంలో ఉన్నాయన్నారు.   ఇప్పటికైనా   అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి  గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ  పెట్టిన దేశ మహిళల ఆరోగ్యం కొరకు ఉజ్వల పథకం ద్వారా వంట  గ్యాస్ పథకాన్ని వినియోగించుకోవాలని భారత దేశంలోభారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడ  ఎలక్షన్లు జరిగిన విజయం సాధిస్తుందని  నరేంద్ర మోడీ  నాయ కత్వంలో అభివృద్ధి  పథకాలను చూసి ప్రజలు బిజెపిని ఆదరిస్తుందన్నారు.    ఉత్తరప్రదేశ్  ఎన్నికల్లో విజయమే ఇందుకు  నిదర్శనం అన్నాడు.  రాబోయే రెండు వేల పందొమ్మిది లో తెలంగాణలోకూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను, నిరుద్యోగులను డబుల్ బెడ్రూమ్లు దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణి  లాంటి హామీలను  నెరవేర్చకపోవడంతో టిఆర్ఎస్కు బుద్ధి చెప్పి  బిజెపికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో    బీజేపీ మండల అధ్యక్షుడు కుందారపు బాలకృష్ణ, ఇగురపుసంజీవ్,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment