Saturday, 2 December 2017

పదవీ విరమణ పొందిన పోలీస్ ఉద్యోగులకు సన్మానం

పదవీ విరమణ పొందిన  పోలీస్ ఉద్యోగులకు సన్మానం  
 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 :  విధి నిర్వహణ ను దైవం గా బావించి   ప్రజా సేవయే   పరమావధి గా పని చేసి పదవి విరమణ పొందిన వారిని సన్మానిoచుకోవటం మన  యొక్క అదృష్టం  అని జిల్లా  ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు, ప్రజా పోలీసు గా పనిచేసినప్పుడే మన  సేవల కు  అమోఘమైన గుర్తింపు లబిస్తుందని ఆయన తెలిపారు.శుక్రవారం జిల్లా లోని స్థానిక జిల్లా ఎస్పి క్యాంపు కార్యాలయం  లొ నవంబర్  మాస అంతమున పదవి విరమణ పొందిన  జే. రామదాన్  ఏ.ఎసై జైనూర్, జి. తులసి రామ్ హెడ్ కానిస్టేబుల్ బెజ్జూర్  లను  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ పదవి విరమణ సందర్బంగా  శాలువ తో సత్కరించి పుష్ప గుచ్ఛము ను అందచేశారు, మరియు  వారి యొక్క 37 సంవత్సరాల సర్విస్ లో చేసిన సేవల గురించి  అడిగి తెలుసుకున్నారు వారు  గడించిన అనుభవం ను తోటి వారికి సలహాల రూపం లో అందిస్తూ వారికి మార్గ నిర్దేశం చేయాలనీ జిల్లా ఎస్పి పదవి విరమణ పొందిన వారిని  కోరారు.   అనంతరం వారి యొక్క శేషజీవితము సుఖ సంతోషాలతో మనుమలు,మనుమరాండ్ల తో  ఆనందం తో గడపాలని అభిలషించారు    వారికీ రావలిసిన బెనిఫిట్స్ ను తక్షణం అందిస్తామని ఈ సందర్బంగా  జిల్లా ఎస్పి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమము లో ఎస్బిసిఐ సుధాకర్ ,ఎస్పిసీసీ దుర్గం శ్రినివాస్,ఎన్.ఐ.బి ఇంచార్జ్ శ్యాం సుందర్, డి.పీ.ఓ.అడ్మినిస్ట్రేషన్ అదికారి ప్రహ్లాద్ , మహిపాల్, సీనియర్ అసిస్టెంట్  కేదార సూర్యకాంత్, ఇంతియాజ్, క్యాంపు కార్యాలయ సిబ్బంది కిరణ్ కుమార్, పోలీస్ అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీరాములు మరియు పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment