నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల అరెస్టు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11: నక్సలైట్ల పేరుతో లక్ష రూపాయలు డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను సోమవారం కస్టడీలోకి తీసుకున్నట్లు కుమ్రంభీం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. తిర్యాని మండలం మంగి గ్రామపంచాయతి నందు మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్బ ఎల్&టి కంపెనీకి చెందిన సబ్ కాంట్రాక్టర్ వెంకటరావు ను నక్సలైట్లమని బెదిరించి లక్ష రూపాయలు డిమాండ్ చేసి ఆరువేల రుపాయలను బలవంతంగా తీసుకున్నారని, ఈ విషయం ఎక్కడ చెప్పిన చంపెస్తామాని అనడంతో భాదితుడు భయాందోళనకు గురి అయ్యాడు అని పేరుకున్నారు. భాదితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానం ఉన్న ఆసిఫాబాద్ జన్కాపూర్ వాసి అయిన షేక్ రజాక్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా కాగజ్‌నగర్ కు చెందిన బావండ్లపల్లి ప్రసాద్ నేను కలిసి నెరమునకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 5వేల రూపాయలు స్వాదీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. కేసును 24గంటల్లో చేదించిన తిర్యాని ఎస్ఐ శ్రీనివాస్ ను మరియు సిబ్బంది ని ఎస్పీ అభినందించారు.
No comments:
Post a Comment