Saturday, 9 December 2017

ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలలో పకడ్బందీ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి ; ఏఐఎస్ఎఫ్

ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలలో పకడ్బందీ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి ; ఏఐఎస్ఎఫ్

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 8 : ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలలో పకడ్బందీ ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి ఖచ్చితంగా అమలు పరచాలని ఏ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ అధ్యక్షులు బావునే వికాస్, కార్యదర్శి పూదరి సాయికిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు అసిఫాబాద్ లోని సీపీఐ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్ లోని గండిపేట సీబీఐటి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం మధ్యాంతరంగా ఫీజును పెంచడం దారుణమని,అట్టి కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని అన్నారు. ప్రతి విద్య సంవత్సరం ప్రారంభం ముందు ఫీజు నియంత్రణ పై చేసే కసరత్తు తూ  తూ   మంత్రం చందంగా    ఉందన్నారు. ఈ విద్య సంస్థలను నియంత్ర ణ   చేయకుంటే ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే నిరు పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువులకు దూరమయ్యే దుస్థితి ఏర్పడుతుంది అని దీనిని ఏ ఐ ఎస్ ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ విద్య సంస్థలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందడమే కాకా తెలంగాణా విద్యార్థి లోకాన్ని తెరాస మోసం చేసిందని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు నంది శ్రీకాంత్, ఆత్రం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment