Sunday, 3 December 2017

కొలువుల కొట్లాట బహిరంగ సభ గోడప్రతులు విడుదల

కొలువుల కొట్లాట బహిరంగ సభ గోడప్రతులు విడుదల
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 3 :  తెలంగాణ జేఏసీ యాక్షన్ కమిటీ తలపెట్టిన కొలువులపై కొట్లాట బహిరంగ సభను ఈ నెల 4న చలో హైదరాబాద్ కు మండలంలోని నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీల నాయకులు వివిధ కుల సంఘాల వారు  అందరూ పాలుపంచుకుని విజయవంతం చేయాలని  జిల్లా కన్వీనర్ ఎల్ రమేష్ అన్నారు. ఆదివారం రెబ్బెన విశ్రాంతి భవనం ఆవరణలో కొలువులపై కొట్లాట బహిరంగ సభకు సంబంధిత గోడప్రతులను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలను ప్రకటించి తక్షణమే నియామక ప్రక్రియను చేపట్టాలని, పలు డిమాండ్లపై కొలువుల కొట్లాట సమావేశంలో జరుగు సభను అందరూ విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా రెబ్బెన మండల యూత్ జేఏసీ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని  రెబ్బెన జేఏసీ చైర్మన్ మిత్ర దేవతా తెలిపారు రెబ్బెన యూత్ జేఏసీ కన్వీనర్ గా ఆవిడకు గోపి, కో కన్వీనర్ గా ఇందూరి మోహన్, చైర్మన్ గా అజ్మీరా శివనాయక్, అన్నపూర్ణ శాంతి గౌడ్, కో కన్వీనర్లుగా ఎం వెంకటేష్, బి వెంకటేశ్వర్లు ఎంపికైన ఈ కార్యక్రమంలో డి మల్లయ్య  భోగ ఉపేందర్, గోవింద్ దుర్గం రవీందర్, రాజేందర్ వంశీకృష్ణ, నరేష్, శ్రీకాంత్, మధుకర్, ప్రేమకుమార్, తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment