కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 13 : కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం గణిత టాలెంట్ జిల్లా పరిషత్ పాఠశాల 10 వ తరగతి విద్యార్థి గట్టు వంశీ గణిత టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచి మండల టాపర్ గ నిలిచాడు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో నిర్వహించిన గణిత టాలెంట్ టెస్ట్ లో తృతీయ స్థానాన్ని సాధించి రాష్ట్ర స్థాయి గణిత టాలెంట్ టెస్టుకు అర్హత సాధించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత హర్షం వ్యక్తం చేసారు. , గణిత ఉపాధ్యాయులు మొగిలి, పార్వతి మరియు ఇతర ఉపాధ్యాయులు వంశీని అభినందించారు. ఈ సందర్భంగా . ఇతర విద్యార్థులు కూడా వంశీని ఆదర్శంగా తీసుకుని మంచి మార్కులతో పాసయి తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ప్రధానోపాధ్యాయురాలు పిల్లలకు ప్రార్థన సమయంలో సందేశం ఇచ్చారు.
No comments:
Post a Comment