ప్రత్యేక అభివృద్ధి కోసం కుమరంబీం జిల్లా ఎన్నిక
కేంద్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు: బిజెపి జిల్లా అధ్యక్షులు జేబీ పౌడెల్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 5 : కుమరంబీం జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వెనుకబడిన జిల్లాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందున కేంద్ర బృందం అధికారిణి వసుధ మిశ్రా కి మంగళవారం కుమరంబీం జిల్లాపాలనాధికారి కార్యాలయ ఆవరణలో పుష్ప గుచ్చం, మెమోరండం సమర్పించడం జరిగిందని బిజెపి జిల్లా అధ్యక్షులు జెబి పౌడెల్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమరంబీం జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగావెనుకబడిన జిల్లాగా గుర్తించి కేంద్రం ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధిపథకాలను ప్రారంభించుటకు అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో .రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొనగిరి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కేసరి ఆంజనేయులుగౌడ్, చర్ల మురళి, చాపిడి అశోక్, కాగజ్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ కోంగ సత్యనారాయణ, బిజెవైయం జిల్లా అధ్యక్షులు కాండ్రె విశాల్, ఆసిఫాబాద్ బిజెవైయం మండల అధ్యక్షులు పడిగెల విజయ్ కుమార్ ఆజాద్, ప్రదాన కార్యదర్శి పేంటపర్తి రాకెష్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment