Wednesday, 6 December 2017

ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రం లో వరి ధాన్యం కొనుగోలు

ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రం లో రి ధాన్యం  కొనుగోలు



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 6 :  రెబ్బెనమండల ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలోబుధవారం  400 బస్తాల ఏ  గ్రేడ్ ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్రం ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఆర్  సంతోష్ తెలిపారు. మండలంలోని రైతుల సౌకర్యంకోసం నేర్పల్లి, నారాయణపూర్, తక్కళ్లపల్లి,నక్కలగూడ గ్రామాలలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు    ఏర్పాటుచేసినట్లు  ఈ కేంద్రాలలో ఏ   గ్రేడ్ ధాన్యానికి 1590 రూపాయలు,  బి గ్రేడ్ ధాన్యానికి 1550 రూపాయలు చెల్లిస్తున్నట్లు, మండలంలోని రైతులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు.  రైతులు ధాన్యం తీసుకొనివచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పట్టాదార్ పాస్ బుక్, మరియు వి ఆర్ ఓ సర్టిఫికెట్ నకళ్ళను తీసుకోని రావలసింది గ  తెలిపారు. 

No comments:

Post a Comment