Wednesday, 13 December 2017

క్రీడలలో ప్రతిభకనబరచిన సింగరేణి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు


  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 13 : బెల్లంపల్లి ఏరియా గోలేటిలో వివిధ క్రీడలలో రాష్ట్రస్థాయి, మరియు జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చిన సింగరేణి ఉన్నత పాఠశాల  విద్యార్థిని విద్యార్థులను   బెల్లంపల్లి   ఏరియా జనరల్ కె రవిశంకర్ మరియు ఏరియా డిప్యూటీ జీఎం పర్సనల్ జూపాక కిరణ్ అభినందించారు. డిసెంబర్ ఐదు  ఆరు తేదీలలో   అసిఫాబాద్ లో   నిర్వహించబడిన జవహార్లాల్ నెహ్రూ నలభై అయిదు వ జిల్లా స్థాయి సైన్స్ మాథెమాటిక్స్  అండ్ ఎన్విరాల్మెంట్ ఎగ్జిబిషన్  2017-18 లో సీనియర్ విభాగంలో గోలేటిలోని  సింగరేణి  ఉన్నత పాఠశాల  పదవ తరగతి విద్యార్థి అప్పాల  ప్రశాంత్  వేస్ట్  మేనేజ్మెంట్  అండ్ వాటర్ బాడీ కన్సర్వేషన్  విభాగంలో నీటి వనరుల  సంరక్షణలో భాగంగా మన ఊరు మన చెరువు ప్రదర్శించిన ప్రాజెక్టు ప్రథమ బహుమతి సాధించి డిసెంబర్  19-22  వరకు వరంగల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఎక్సిబిషన్ కు ఎంపిక అయినాడు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కురవిలో డిసెంబర్ 4-6 తేదీలలో జరిగిన పోటీల్లో అండర్  17 విభాగంలో 10వ తరగతి విద్యార్థిని  స్వర్ణలత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అలాగే  నలభై అయిదవ సబ్   జూనియర్  అంతర్ జిల్లాల సాపాక్ తక్రా  చాంపియన్ షిప్  రెండువేల పదిహేడు (బాలుర, బాలికల ) విభాగంలో నిజామాబాద్ లో డిసెంబర్  7-10 తేదీలలో  నిర్వహించబడిన సాపక్   తక్రా విభాగంలో సింగరేణి కాలరీస్ ఉన్నత  పాఠశాల గోలేటి నుండి ఏడు గురు విద్యార్థులు, 5 గురు  విద్యార్థినిలు  పాల్గొన్నారు వీరిలో బాలికల విభాగం నుండి ఏడవ తరగతి విద్యార్థులు ఆర్ శరణ్య మరియు వి ప్రవళిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.  అరవై మూడో సీనియర్ అంటారా జిల్లాల  తెలంగాణ రాష్ట్ర బాల్ బాట్ మెంట్ చాంపియన్ షిప్ 2017-18    బాలికల విభాగంలో డిసెంబర్ తొమ్మిది పదవ తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ జరిగిన పోటీల్లో సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల గోలేటి విద్యార్థులు ఎనిమిది మంది పాఠశాల తరపున పాల్గొని ద్వితీయ స్థాయి కైవసం చేసుకున్నారు వీరిలో పదవతరగతి విద్యార్థినికి అంజలి తొమ్మిదో తరగతి విద్యార్థిని డి శ్రావణి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనా వీరిద్దరూ హర్యానా రాష్ట్రంలో జరగబోయే పోటీల్లో పాల్గొంటారు.  ఈ పోటీలలో పాల్గొని  రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయి   పోటీలో ఎంపికైన విద్యార్థిని  విద్యార్థులను వారికీ   తోడ్పడిన పాఠశాల ఉపాధ్యాయులను  బెల్లంపెల్లి ఏరియా  జనరల్ మేనేజర్ కె రవిశంకర్  మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ పర్సనల్ జూపాక కిరణ్  మరియు పాఠశాల కరెస్పాండంట్  ప్రత్యేకంగా అభినందించారు.  ఆటపాటల లోనే  కాకుండా చదువులో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని  కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్   వెంకటేశ్వర్లు,  సీనియర్ ఉపాధ్యాయులు  శ్రీనివాసరావు,   మూర్తి,  పి  ఈ  టి  కె భాస్కర్ ,ఏ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment