Friday, 1 December 2017

సెర్ప్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి 33 వ రోజుకు సమ్మె

 సెర్ప్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి 33  వ  రోజుకు సమ్మె 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్  01 : సెర్ప్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక  సమ్మె శుక్రవారం 33వ రోజుకు చేరింది.     ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ   ప్రభుత్వం తమ డిమాండ్ లను పరిష్కరించడానికి ముందుకు రాకపోవడం శోచనీయమని అన్నారు. సెర్ప్‌ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు  తమ డిమాండ్ లన్ని హేతుబద్దమైనవని వెంటనే ప్రభుత్వం స్పందించి   డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.ఈ  కార్యక్రమంలో జాడి  సంపత్, భీం రావు, హన్మంతు, సురేష్, శంకరయ్య, ముక్తేశ్వర్, రాజేశ్వర్,, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment