కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 01 : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా రెబ్బెన ప్రభుత్వ ప్రాధమిక ఆసుపత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో రెబ్బెన మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆసుపత్రి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ కుమార్, డాక్టర్ నాగమణి మాట్లాడుతూ ఎయిడ్స్ పై ప్రతిఒక్కరు అవగాహన కల్పించుకోవాలని ,, వ్యాధిగ్రస్తులను వివక్షతో చూడవద్దని, సరైన మందులు సకాలంలో వాడితే వ్యాధి నియంత్రణలో ఉంటుందని అన్నారు.ప్రతిఒక్కరు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్, పావని, కమలాకర్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment