Monday, 11 December 2017

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఉత్సాహంగా ఉండాలి : జిల్లా పాలనాధికారి చంపాలాల్

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఉత్సాహంగా ఉండాలి : జిల్లా పాలనాధికారి చంపాలాల్ 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11 :    ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో  అలసత్వం వహించకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ఎం.చంపాలాల్ జిల్లాలోని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో  నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా పాలనాధికారి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.  ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఆయా సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలన్నారు. దహెగాం  మండలం గిరివెల్లి గ్రామానికి చెందిన ఇస్తారు తన భూమిని వేరే వ్యక్తులు కబ్జా  చేసుకున్నారని  తనకు న్యాయం చేయాలని వినతి  ఇవ్వగా, గొడిచెర్ల నివాసి అయిన సుశీల తన స్వంత భూమిని వేరే వారు ఆక్రమించుకున్నారని తన భూమిని తనకు ఇప్పించవలసిందిగా అర్జీ సమర్పించింది. ఈ ప్రజా ఫిర్యాదుల్లో సుమారుగా ముప్పై మంది  అర్జీలు పెట్టున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్, ఆర్డీఓ కదం సురేష్,  జిల్లా అధికారులు,  ఆర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment