విద్యార్థుల వసతి గృహాలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం :
ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్
ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 : సంక్షేమ వసతి గృహాల, ఆశ్రమ ఉన్నత పాఠశాలల విద్యార్థులు చలికాలం కావడం వలన తీవ్ర అవస్థలు పడుతున్నారని ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రెబ్బన మండలం గోలేటిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం రాత్రి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పూదరి సాయికిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పాలకుల విధానాలు మారడం లేదని, వసతి గృహం విద్యార్థులకు బ్లాంకెట్లను ప్రభుత్వం సరఫరా చెయ్యాలని ఆయన అన్నారు. వసతి గృహంలో సోలార్ వాటర్ హీటర్ చెడిపోవడం వలన విద్యార్థులు చలిలో వణుకుతూ ఉదయాన్నే చల్లని నీటితోనే స్నానాలు చేస్తూ అవస్థలు పడుతున్నారని అన్నారు. వాటర్ హీటర్ కు వెంటనే మరమ్మత్తులు చేయించి వేడి నీటిని స్నానాలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విదంగా త్రాగు నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ చెడిపోయి కొన్ని నెలలు అవుతున్న పట్టించుకున్న నాధులే లేరని అయన ఆరోపించారు.ఆర్వో ప్లాంటును పునరుద్ధరించి శుద్దీకరణ త్రాగు నీరు ఆనందించాలని అన్నారు.కేవలం ఇక్కడనే కాదు జిల్లా వ్యాప్తంగా అనేక వసతి గృహాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని అయన అన్నారు. ఇన్ని సమస్యలు ఉంటె వాటిని పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన అభివృద్ధి సంస్థలు ఎక్కడికి వెళ్లాయో అర్ధ కావడం లేదని అన్నారు. విద్య సంవత్సరం 60 శాతం పూర్తి కావస్తున్నా నేటికీ ఏక రూప దుస్తులు పంపిణి చేయకపోవడం , పూర్త్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వపోకవడాం చూస్తుంటే ప్రభుత్వ విద్య పైన ప్రభుత్వానికి ఎంత మేరకు పట్టింపు ఉన్నదో స్పష్టం అవుతుందని అన్నారు. తెరాస ప్రభుత్వం విద్య వ్యవస్ధను బ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. విద్య వ్యవస్థ పైన సవితి తల్లి ప్రేమను ప్రభుత్వం విడనాడాలని అన్నారు. ఆయన వెంట పట్టణ కార్యదర్శి జాడి సాయికుమార్, అధ్యక్షులు పడాల సంపత్, నాయకులు సంజయ్, సాగర్ విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment