ఈ నెల 13న జిల్లా కేంద్రంలో తెలుగు మహాసభలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11: ప్రపంచ తెలుగు మహాసభలు-2017 సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా పరిపాలన అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ తేదీ(బుధవారం)రోజున ఉదయం 10 గంటలకు ర్యాలీ నిర్వహించనున్నట్లు, ఈ ర్యాలీ అంబేడ్కర్ చౌక్ నుండి ప్రారంభమై వివేకానంద చౌక్ మరియు గాంధీ చౌక్ మీదుగా కుమ్రంభీం చౌక్ వద్ద ముగుస్తుందని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2గంటల నుండి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తెలుగు మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మొదట కవి సమ్మేళనం, సాహితీ గోష్ఠి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం కవులు, కళాకారులకు సన్మానాలు ఉంటాయన్నారు. విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందన్నారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, తెలుగు పండితులు, కవులు, కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొంటరని తెలిపారు. కవులు మరియు కళాకారులు 13వ తేదీన ఉదయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవాలన్నారు.
No comments:
Post a Comment