ఈత చెట్లను నరికిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 11 : మిషన్ భగీరథ పనుల్లో భాగంగా రెబ్బెన మండలంలోని గోలేటి కి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఈత చెట్లను ఎలాంటి అనుమతి లేకుండా సంబంధిత కాంట్రాక్టరు అక్రమంగా నరుకుతుండగా గీత కార్మికులు పనులను అడ్డుకున్నారు. అప్పటికే 15 ఈత చెట్లను తొలగించారు. దీనితో గౌడ కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని జిల్లాలోని ఉన్నతాధికారులు, ఎక్సైజ్ అధికారులు చెట్లను తొలగించిన వారిని వెంటనే అరెస్టు చెయ్యాలని గీత కార్మికులు డిమాండ్ చేసారు. ఈ సందర్భాంగా వారు మాట్లాడుతూ చెట్లను తొలగించేందుకు ఉపయోగించిన ప్రోక్లైన్ ను సిజ్ చెయ్యాలని గీత కార్మికులకు న్యాయం చేయాలని తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.పనులను అడ్డుకున్న వారిలో తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్, మండల కార్యదర్శి చెపురి వెంకటస్వామిగౌడ్, గోలేటి గీత కార్మిక సంఘం అధ్యక్షులు కేసరి సాయగౌడ్, గట్టు ప్రభాకర్ గౌడ్, అరిగెల మదుకర్ గౌడ్, కేసరి నారాయణ గౌడ్, కేసరి కైలాసం గౌడ్, మలిశెట్టి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment