ప్రపంచ తెలుగు మహా మహాసభలు 2017 కు ఏర్పాట్లు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 12 : ప్రపంచ తెలుగు మహా మహాసభలో 2017 సందర్భంగా చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు హైదరాబాద్లో జరిగే వేడుకలలో పాల్గొనడానికి ఆసక్తి గలవారు సాహితీవేత్తలు, కళాకారులు, తెలుగు భాషా అభిమానులు ప్రజాప్రతినిధులు మొదలైన వారు సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా పాలనాధికారి చంపాలాల్ వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం తెలిపారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించే వారికీ బస్ సౌకర్యం కలదని, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, జైనూర్, కౌటాల, తదితర ప్రాంతాల నుంచి హైదరాబాదు సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన తెలిపారు ఆసక్తి కలవారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదిన మహాసభలు ముగిసేంవరకు హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. అదే విధంగా బుధవారం నాడు జిల్లా కేంద్రంలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కలెక్టరేట్లో జరుగుతాయని ఉదయం పది గంటల నుంచి ర్యాలీ, రెండు గంటల నుండి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అన్నిశాఖల అధికారులు మరియు సాహితీ ప్రియులు భాషా అభిమానులు కవులు కళాకారులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్, సిపిఓ కృష్ణయ్య ,డిఇవో రఫిక్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment