Thursday, 14 December 2017

శ్రమ శక్తి సంఘాలలో మార్పులు చేర్పుల కు అవకాశం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా  ప్రతినిధి) డిసెంబర్ 14 :   శ్రమ శక్తి  సంఘం లో సభ్యుల మార్పులు చేర్పులకు  ముఖ్యమైన సూచికలు జారీచేసినట్లు ఏ  పి  ఒ  కల్పనా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గత మూడు సంవత్సరాలు గ శ్రమశక్తి సంఘము లలో మార్పులు చేర్పులకు  అవకాశము లేదని,ఈ సంవత్సరం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రమ శక్తి సంఘం లో గల సభ్యులందరూ పని చేయుట లేదు దాంతో కనీసఁ కూలీ రేటు తగ్గుతుంది.ప్రతి శ్రమ శక్తి సంఘం లో 20 నుండి40 మంది కూ ళీల కు అవకాశం ఉందని ఇంతవరకు శ్రమ శక్తి సంఘం లో కూలీల సంఖ్య యెక్కువ పనికి వచ్చు వారి సంఖ్య తక్కువ  ఉండేదని దాంతో మస్టర్ రోల్ నిర్వహణ ఇబ్బంది గ ఉండేదని  . సీజన్లో FA కు మస్టర్ నిర్వహణ ఇబ్బందిని తగ్గించుటకు గ్రూప్ పునర్విభజన  తప్పనిసరి అయిందని . దీంతో పని ప్రదేశం లో వసతుల కల్పన కు అనువుగా ఉంటుంది.అని అన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది కి డిమాండ్ తీసుకొనటం, పనిని కేటాయింపు మరియు పే ఆర్డర్  జనరేషన్  కు అనుకూలముగా ఉంటుందని ఈ ఆర్ధిక సంవత్సరం లో అనగా ఏప్రిల్ 2017 నుండి ఇప్పటి వరకు కనీసం 5 రోజులైనా పనిచేసిన కూళీలు శ్రమ శక్తి సంఘం లోకి మారవచ్చు.ఖచ్చితముగా ప్రతి  శ్రమ శక్తి సంఘం కు కొత్త మేట్  ఎంపిక తప్పనిసరి.అని  50 % మంది మహిళ మేట్స్ తప్పనిసరి.మరియు ఓక కుటుంబ సభ్యులంతా ఓకె శ్రమ శక్తి సంఘం లో ఉండవచ్చు.2014 ఏప్రిల్ నుండి ఇంతవరకు అసలే పనికి వేళ్ళని శ్రమ శక్తి సంఘం రద్దు చేయబడును తక్కువ పని దినాలు నమోదైన శ్రమ శక్తి సంఘం కూడ రద్దు చేయబడును అని తెలిపారు. శ్రమశక్తి సంఘం లో నమొదైనప్పటికి పనికి వేళ్ళని కూలీల పేర్లు సంఘం జాబితా  లో కనపడవు.శ్రమశక్తి సంఘం లో ఏ తెగ కు చెందినవారు 50% కంటే పైబడి ఉన్నారో ఆ తెగ కు సంబంధించిన వారిని మాత్రమే మేట్ గ ఎంపిక చేసుకోవాలని  మొదటి గ్రూప్ కు చెందిన మెట్ మహిళా అయితే ఆటోమేటిక్ గ రెండవ గ్రూప్ మెట్ పురుషులు ఉంటారని అన్నారు.  ఒకవేళ   అవినీతి అక్రమాలకూ పాల్పడినట్టు సామాజిక తనిఖీ లేదా ఇతర మార్గాల ద్వార తెలిసిన వ్యక్తి మెట్   యొక్క జాబ్ కార్డు రద్దు చేయబడును అని తెలిపారు. 

No comments:

Post a Comment