Saturday, 9 December 2017

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో స్టాళ్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం  
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 9 :  సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా  ఈ నెల 28 న బెల్లంపల్లి ఏరియా గోలేటి  టౌన్ షిప్ లోని  శ్రీ భీమన్న స్టేడియం గ్రౌండ్ నందు నిర్వహించనున్న  స్టాళ్ల ఏర్పాటుకు ఔత్సాహికులు  దరఖాస్తులు చేసుకోవాలని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు . వేడుకల్లో భాగంగా వివిధ స్టాళ్లు, వ్యాపార సముదాయాలు, ఫుడ్స్ స్టాళ్లు ఏర్పాటుకు ఆసక్తి గల వారు జిఎం ఆఫీసులోని పర్సనల్ డిపార్టుమెంటులో దరఖాస్తులు తేదీ పదిహేను పన్నెండు రెండువేల పదిహేడు లోపు అందించాలని కోరారు అలాగే సింగరేణికి చెందిన స్టాళ్ల ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మహిళలకు చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారన్నారు అని వివరించారు విజేతలకు బహుమతులు అందించనున్నట్లు వెల్లడించారు వివరాలకై డివై పిఎం శ్రీ ఏ రాజేశ్వర్ ను సంప్రదించగలరు అని సూచించారు.

No comments:

Post a Comment