కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 14 : కొమురంభీం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దివ్యంగుల కొరకు ఈ నెల 22 న సదరం క్యాంపు జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి చంపాలాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని దివ్యానుగులందరు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్యాంపు కు హాజరయ్యే దివ్యంగుల అవసరాల కొరకు స్వచంద సంస్థలు ముందుకు వచ్చి సేవలు అందించాలని కోరారు. సదరం క్యాంపు కు వచ్చే దివ్యంగులు తమ వెంట రెండు ఫోటోలు, ఆధార్ కార్డు నకలు పై ఫోన్ నెంబర్ వ్రాసి తెచ్చుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment