Thursday, 14 December 2017

విధినిర్వహణలోఉపాధ్యాయలు అలసత్వం తగదు



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా  ప్రతినిధి) డిసెంబర్ 14 : ఉపాధ్యాయ వృత్తి చాల పవిత్రమైనదని  దానిలో అలసత్వం ప్రదర్శించరాదని వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ పి . ప్రవీణ్ అన్నారు. గురువారం రెబ్బెన జిల్లా పరిషత్ పాఠశాలను   ఆకస్మికంగా తనిఖీచేసి ఆయన పాఠశాల రికార్డులను, విద్యార్థుల హాజరును పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును సంబంధిత ఏజెన్సీ ని, విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తప్పని సరిగా పాఠ్య  ప్రణాళికకు సంబందించిన యూనిట్, సిలబస్ ను తయారు చేసుకోవాలని అన్నారు. అనంతరం గంగాపూర్ ఉన్నత పాఠశాలని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment