Saturday, 9 December 2017

సింగరేణి ఓపెన్ కాస్టులో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి

 సింగరేణి ఓపెన్ కాస్టులో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 9 :   ఓపెన్ కాస్టులో మట్టి తీసే పనుల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని కొమురం భీం కాంట్రాక్టు కార్మిక సంఘం ముఖ్య సలహాదారు అరిగెల మల్లికార్జున డిమాండ్ చేశారు శనివారం నాడు ఆయన బెల్లంపల్లి ఏరియాలో డోర్లీ ఓపెన్ కాస్టు మట్టి పనుల గుత్తేదారైనా      మహాలక్ష్మి కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన ద్వార సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు బెల్లంపెల్లి చుట్టుపక్కల  ప్రాంతాలలో  ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారని  వారిని కాదని  స్థానికేతరులను తీసుకోవద్దని  అన్నారు.  స్థానికుల ఉద్యోగాల కోసం కొమురం భీమ్ కాంట్రాక్టు కార్మిక సంఘం పోరాడుతుందని అదే కాకుండా ఉద్యోగులను యాజమాన్యం వేధిస్తోందని మరియు సరి అయిన సంక్షేమ పధకాలు అమలు చేయడం లేదని వారికి రావలసిన ఎన్నో హక్కులు కాలరాస్తున్నారని అన్నారు. అందుకే కొమురం భీం  కాంట్రాక్టు కార్మిక సంఘాన్ని ప్రారంభించామని స్థానిక  కమిటీలు నియమించి కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు కార్మికులకు అందుబాటులో ఉంటామని అన్నారు ఈ సమావేశంలో కొమురంభీం కాంట్రాక్టు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వజ్రాల శ్రీనివాసరావు అధ్యక్షుడు కె కమలాకర్,  ప్రధాన కార్యదర్శి పూదరి మొండయ్య,  సంతోష్ కె సుధాకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment