కొలువుల కొట్లాట సభ సన్నాహక సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 2 : నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని జెఎసి జిల్లా కో కన్వీనర్ రాయల నర్సయ్య అన్నారు శనివారం రెబ్బెన విశ్రాంతి భవనంలో జాక్ మండల చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినకొలువుల కొట్లాట సభ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ సాధించుకున్నప్పటికీ ఎన్నికల హామీలో ఇంటికో ఉద్యోగం అని చెప్పి అధికారంలోసి వచ్చి మూడున్నరేళ్లవుతున్న ఇప్పటికీ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి చర్యలు మొదలు పెట్టక నిరుద్యోగులను మాటల గారడితో మోసం చేస్తున్నారన్నారు. ఈ నెల నాలుగు తారీఖున చలో హైదరాబాద్ సకల జెఎసి తలపెట్టిన కొలువులు కొట్లాట సభకు మండలంలోని నిరుద్యోగులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలి వచ్చి సభను జయప్రదం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో బి సీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ పి . మొండయ్య, జాక్ మండల కో కన్వీనర్ దుర్గం మల్లయ్య ,మండల జాక్ నాయకులూ మహేష్, అజమీర హరిలాల్, ప్రేమకుమార్, హరీష్, తిరుమల, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment