లంబాడి మహాసభకు సన్నాహక ర్యాలీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 10 : రెబ్బెన మండలంలో ఆదివారం నాడు లంబాడీలు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద సభ జరిపారు. ఈ సభలో లంబాడి నాయకులు అజ్మిరా బాపు రావు మాట్లాడుతూ ఈ నెల 13న జరప నిర్ణయించిన లంబాడి మహాసభకు సన్నాహకంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని 31 జిల్లాలలో 25 లక్షల మంది లంబాడీలు ఉన్నట్లు, ఎన్నో ఏళ్లుగా కలసి మెలిసి ఉంటున్న ఆదివాసీలు, లంబాడి లను విడదీయడానికి జరిగిన కుట్రలో భాగంగానే కొద్దికాలంగా లంబాడి లపై విమర్శలు చేస్తున్నారని, దీనిని ప్రజలకు వివరించడానికి అహింసాయుత మార్గంలో .మహాసభ జరపడానికి నిశ్చయించామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లంబాడీలు పెద్ద సంఖ్యలో మహాసభలో పాల్గొని జయప్రదంచేయాలని కోరారు.ఈ ర్యాలీ లో నాయకులు ఏ రమేష్, రవి ,దుప్ప నాయక్, ఆత్మ రామ్నాయక్, శేఖర్ , ఎల్ రమేష్, మరియు పెద్దసంఖ్యలో లంబాడీలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment