Friday, 15 December 2017

లంబాడీలను ఎస్ టి జాబితానుంచి తొలగించాలి ; ఆదివాసీ జాక్

లంబాడీలను ఎస్ టి జాబితానుంచి తొలగించాలి ; ఆదివాసీ జాక్
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 15 : లంబాడీలను ఎస్ టి జాబితానుంచి తొలగించాలని కోరుతూ శుక్రవారం నాడు కొమురంభీం జిల కేంద్రమైన ఆసిఫాబాద్లో అంబెడ్కర్ చౌక్ వద్ద    ఆదివాసీ జాక్ ఆధ్వర్యంలో రాష్ట్ర రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జాక్ జిల్లా అధ్యక్షులు కె  విజయ్ ,  జిల్లా  నాయకులు శంకర్ స్వామిలు మాట్లాడుతూ లంబాడీలను ఎస్ టి   జాబితా నుండి తొలగించి  ఆదివాసీ ల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడాలని కోరారు. నిజాం ప్రభుత్వంలో కొమురంభీం  జల్,జంగల్ జమీన్  అనే నినందంతో శాంతి యుతంగా పోరాటం చేసి సాధించి న ఆదివాసీ హక్కులను కాపాడుకోవడానికి అహింస మార్గంలోనే పోరాటం చేస్తున్నామన్నారు . కానీ లంబాడి నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్నారన్నారు . సోషల్ మీడియాలలో ఆదివాసీలపై దుష్ప్రచారం సాగిస్తున్నారని, దీనిపై  ప్రభుత్వ వర్గాలు , పోలీసులు తక్షణమే చర్య తీసుకోని వారిని నిలువరించాలని కోరారు. శాంతియుతంగా చేస్తున్న ఈ పోరాటానికి పోలీసులు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జాక్ మహిళా అధ్యక్షురాలు డి విజయ,సహాయ కార్యదర్శి ప్రమీల, గోండు మని అధ్యక్షురాలు కొట్నాక లక్ష్మి , కార్యదర్శి శకుంతల, నాయకులూ నాందేవ్, పీతాంబర్, మహేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment