Tuesday, 12 December 2017

లంబాడిల చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి

 లంబాడిల చలో హైదరాబాద్ ను జయప్రదం చేయండి 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (మా ప్రతినిధి) డిసెంబర్ 12 : తెలంగాణ లంబాడి శంఖరావం  బహిరంగ సభ  రేపు జరుగనున్న నేపథ్యంలో లంబాడి  సోదరులు భారీగా సభకు హాజరు కావాలని  గిరిజన నిరుద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగ్లోత్ గోవింద్ నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున  రెబ్బెన మండలం గోలేటిలో శంఖారావం గోడప్రతులను లంబాడి కులస్థులు విడుదల చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తెలంగాణలోని 31 జిల్లాలలో 25 లక్షల మంది లంబాడీలు ఉన్నట్లు, ఎన్నో ఏళ్లుగా కలసి మెలిసి ఉంటున్న ఆదివాసీలు, లంబాడి లను విడదీయడానికి జరిగిన కుట్రలో భాగంగానే కొద్దికాలంగా లంబాడి లపై విమర్శలు చేస్తున్నారని, దీనిని ప్రజలకు వివరించడానికి అహింసాయుత  మార్గంలో .మహాసభ జరపడానికి నిశ్చయించామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న లంబాడీలు పెద్ద సంఖ్యలో మహాసభలో పాల్గొని  జయప్రదంచేయాలని కోరారు. గోడప్రతులు విడుదల చేసిన వారిలోగణేష్ లాల్, ఇందల్ సింగ్,హరి, ప్రకాష్,  రమేష్, రవి, సుబ్బారావు, ప్రేమ్ జాదవ్   పాల్గొన్నారు. 

No comments:

Post a Comment