సోనియా గాంధీ జన్మ దీన వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 9 ; సోనియా గాంధీ కృషి వల్లే తెలంగాణ ఆవిర్భవించిందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాలకు ఎన్నో సంక్షేమ పథకాలును అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యం రవీందర్ అన్నరు. రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహంలో శనివారం సోనియా గాంధీ జన్మదిన సందర్బంగా కేక్ కట్చేసి పండ్లు, మీటయిలు పంచరు. అనంతరం వారు మాట్లాడుతు కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు ను అందిస్తూ ఎంతో సేవచేశారని తెలంగాణ రావటానికి సోనియా గాందే కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి ఏ వెంకన్న, ఉప అద్యక్షుడు, రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి దుర్గం దేవాజి, వస్రం నాయక్, పుదారి హరీష్, గందె సంతోష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment