Saturday, 9 December 2017

కొమురంభీం జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ అదాలత్

కొమురంభీం  జిల్లా కోర్ట్ లో  జాతీయ లోక్ అదాలత్ 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 9 :జాతీయ  లోక్ అదాలత్  కార్యక్రమాన్ని  శనివారం రోజు కొమురం భీం జిల్లా  కోర్టు ఆవరణలో నిర్వహించారు.  ముందుగా  సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ మరియు ఇంచార్జ్ డిఆర్ఓ ఆర్డీవో రమేష్ బాబు జ్యోతి ప్రజ్వలన గావించారు.  అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు బొకేలకు బదులు మొక్కలతో ఆహ్వానించారు.  ముందుగా సీనియర్ సివిల్ జడ్జి కనకదుర్గ మాట్లాడుతూ సమన్యాయ సామాజిక న్యాయం అన్నట్లు కక్షి  దారులందరికీ  రాజీ కేసులు పరిష్కరించు తున్నామని రెవెన్యూ కు సంబంధించిన కేసులో కూడా ఈ కార్యక్రమం లో  సామరస్యంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాజి మార్గంలో  . వెళితేనే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సమయాన్ని, ఖర్చును  తగ్గించుకునేందుకు అందరూ సమాన భావం స్నేహిత భావంతో మెలిగితే శాంతి నెల కోరుతుందన్నారు.  న్యాయవ్యవస్థలో పాటు రెవెన్యూ మరియు పోలీసు శాఖ వివిధ శాఖల వారు కలిసి పనిచేస్తారనే  భావన కలగాలని ఈ కార్యక్రమం ఉద్దేశించ బడుతున్నది రెవెన్యూ మరియు పోలీసు కేసులు పరిష్కరించ బడుతున్నాయి కేసులు రాజీ పడేందుకు సాక్ష్యాధారాలతోనే ముందుకు  రావాలన్నారు.   మన కక్షలు మన పిల్లల వరకు పోకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.  ఇంచార్జ్ డిఆర్ఓ రమేష్ బాబు మాట్లాడుతూ తెలిసి తెలియని క్షణికావేశంలో తప్పులు జరుగుతాయని ఆ తప్పులను సరి చేసుకోవాలన్నారు.  అడిషనల్ ఎస్పీ  మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్  కార్యక్రమం  సమస్య సత్వర రాజీ మార్గానికి జోహార్ పలుకుతుందని అన్నారు అందువల్ల మీ కేసు మీరే స్వంతంగా  పరిష్కరించు కొనేందుకు ముందుకు రావాలన్నారు . జూనియర్ సివిల్ జడ్జి హేమలత మాట్లాడుతూ చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు రాజే మార్గంలో  కేసులు పరిష్కరించుకోవాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సురేష్ మాట్లాడుతూ ప్రజల చట్టాల గురించి అవగాహన కల్పించి ఉండాలన్నారు చట్టం ముందు అందరూ సమానమే  అన్నారు.   బార్ అసోసియేషన్ అధ్యక్షులు  రవీందర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం న్యాయవాదులు పది శాతం ఉచితంగా సేవలు అందచేస్తున్నారన్నారు.  కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోమని గెలిచినా ఓడినా కక్షిదారులు ఇద్దరూ నష్టపోతారని అలాకాకుండా  రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలన్నారు  అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. కక్షిదారుల నుండి సమస్యలను స్వీకరించి రాజీ మార్గాల్లో పరిష్కరించారు.  ఈ జాతీయ లోక్ అదాలత్ లో  ముప్పై ఆరు కేసులు పరిష్కరించడ  మైనదని అన్నారు.  ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ మరియు అటవీ శాఖా దారులు కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment