ఆసిఫాబాద్ బిజెవైఎం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 8 : స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగాఆసిఫాబాద్ లోని బిజెపి బిజెవైయం కార్యకర్తలు , గ్రామస్థులు కలసి బాజార్వాడిలోని ఎల్ఐజి కాలనీ పాఠశాల పక్కన ఉన్న చెత్తకుప్పలను పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లాఅధ్యక్షులు ఖాండ్రే విశాల్ మాట్లాడుతూ మనఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లే మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడమే స్వచ్ఛ భారత్ ఉద్దేశమని,మహాత్మా గాంధీ ప్రవచించిన దానిని ఆదర్శంగా తీసుకోని ప్రధాన మంత్త్రి .నరేంద్రమోడీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని అందరు ఒక ఉద్యమంగ చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండా శంకర్, రాధిక, విజయ్ కుమార్, రాకేష్ ,గోదాబాయి , వరలక్ష్మి, , అఖిల్, అస్మిత, తదితరులు పాల్గొన్నారు. .
No comments:
Post a Comment