మండల స్థాయి పి హెచ్ సి లను ఆదునికరిoచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతాం ; వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మ రెడ్డి
రైతుల కు నిరంతరం విద్యుత్ ఉచితంగా అందజేస్తామం ;రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న
రైతుల కు నిరంతరం విద్యుత్ ఉచితంగా అందజేస్తామం ;రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగురామన్న
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 12 : మండల స్థాయి పి హెచ్ సి లను ఆదునికరిoచి ప్రజల ఆరోగ్యన్నీకాపాడుతామని తెలంగాణ రాష్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మ రెడ్డి అన్నారు. గురువారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ కేంద్రం లోని భట్టుపల్లి గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో బోధకాల వ్యాధిగ్రస్తులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రం సంక్షేమ రంగానికి 40 వేళా కోట్ల రూపాయలు కేటాయించలేదని ఒక్క తెలంగాణ మాత్రమే కేటాయించిందని, తద్వారా సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిందని అన్నారు .ప్రజల ఆరోగ్యపరిస్థితి మెరుగు పడాలంటే ఒక్క ఆరోగ్య శాఖ పనిచేస్తేనే సరిపోదని, ప్రతి పౌరుడు ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం బోదకాలు వ్యాధిగ్రస్తులకు దోమతెరలు, వెస్ట్రన్ టాయిలెట్ బేసిన్ లను పంపిణి చేసారు. అనంతరం జిల్లా ఇంచార్జి మంత్రి జోగురామన్న మాట్లాడుతూ 70 సంవత్సరాలుగ జరగని అభివృద్ధిని తెలంగాణ వచిన తర్వాత చేసి చూపిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిదే అని , రాబోయే రోజుల్లో రైతుల కు నిరంతరం విద్యుత్ ఉచితంగా అందజేస్తామని , కరెంట్ కోతలు లేకుండా విద్యుత్ అందజేసిన ఘనత ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిదే నని , రైతులు ఆత్మహత్య చేసుకోకుండా , రైతుల ను అన్ని విధాలా అధుకునేoదుకు అనేక చర్యలు చేపట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానిదే నని , చరిత్ర లో రైతుల ను అధుకునేoదుకు ఏ ప్రభుత్వం క్రుషి చెయ్యలేదు , ఒక్క తెరాస ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో శ్రద్ధతో పనిచేస్తుందన్నారు. , రైతుల కు పెట్టు బడి కొసం ఎకరానికి 4వేలు చెల్లిస్తున్నామని ప్రాజెక్టుల నుండి చుక్క నీరు అందకున్న గత ప్రభుత్వాలు పట్టించుకోలేదాని పంట , కెనాల్ లేక భూములు బీడు పోయాయి , కానీ తెరాస పార్టీ అధికారం లోకి రాగానే అటవీ పర్యావరణ అనుమతులు తెప్పించి కెనాల్స్ పూర్తి చేయించి సాగు నీరు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేo దుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామని , బీసీ లను ఆధుకున్న ప్రభుత్వం ఒక్క తెరాస ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కోనేరు కోనప్ప , జిల్లా పాలనాధికారి చంపాలాల్ తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment