సెనగ విత్తనాలు పంపిణి షురూ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 23 :సెనగ విత్తనాలు పంపిణీకి సిద్ధముగా ఉంచినట్లు రెబ్బెన మండల వ్యవసాయ అధికారి మంజుల తెలిపారు. సోమవారంనాడు విత్తన పంపిణి ప్రారంబించి మాట్లాడుతూ యాభై క్విటాళ్ళ విత్తనాలు పంపిణి కి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఇరవై ఐదు కిలోల విత్తనాల ధర 1200 రూపాయలని, కావలసిన రైతులు మీ సేవ పహాణి, ఆధార్ కార్డుల నకలు తో రెబ్బెన ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ ,డైరెక్టర్ పల్లె రాజేస్వర్ రావు, సింగల్ విండో చైర్మన్ రవీందర్, డైరెక్టర్ మధునయ్య, సహాయ వ్యవసాయ విస్తరణాధికారి మార్క్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment