Thursday, 26 October 2017

జిల్లా పాలనాధికారిని కలసిన టి డబ్ల్యూయూ జె- ఐ జె యూ కొమురంభీం జిల్లా సభ్యులు ; జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి

జిల్లా పాలనాధికారిని కలసిన టి డబ్ల్యూయూ జె- ఐ జె  యూ కొమురంభీం జిల్లా సభ్యులు

  • జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 26 :    తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఐ జె  యూ  అస్సోసియేషన్ ( కొమురంభీం జిల్లా)కి కొత్తగా ఎన్నికైన క మిటి సభ్యులు  గురువారం నాడు జిల్లా పాలనాధికారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పాలనాధికా రికి పుష్పగుచ్ఛం అందచేశారు. జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్  పాలనాధికారికి  తమ సభ్యులను పరిచయంచేసారు. అనంతరం  తమ సమస్యలు పరిష్కరించాలని విన తిపత్రం సమార్పించారు. _నూతన జిల్లా కమిటీకు కలెక్టర్ అభినందనలు తెలియచేసి వారి సమస్యలపై సానుకూలంగా స్పందించారని అసోసియేషన్ అధ్యక్షులు  అబ్దుల్ రహమాన్ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ  అర్హులైన జార్నలిస్టులకు వెంటనే అక్రి డేషన్ జారీ చేసి ,జిల్లాలోని జార్నలిస్టు లకు ఇంటి స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలనీ ,ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు .ఆలస్యం చేయకుండా అక్రిడేషన్లు జారీ చేయాలనీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహేమన్, ప్రధాన కార్యదర్శి స్ ఎస్ సంపత్ కుమార్ లు కోరారు.జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ఎలెక్ట్రానిక్ మీడియా విలేకరులకు స్టేట్ బస్ పాస్ సౌకర్యం కల్పించిన జిల్లా కలెక్టర్ ,డిపిఅర్ఓ ,అక్రిడేషన్ కమిటి సభ్యులకు కృతజ్ఞతలు తెల్పారు. ఏ సమస్యలు ఉన్న దృష్టికి తీసుకొనిరావాలని కలెక్టర్ తెలిపారన్నారు. ఈ  .    కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు సదానంద్,  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహేమన్, ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్,అక్రి డేషన్ మెంబెర్ ప్రకాష్ గౌడ్ ,కోశాధికారి అడప సతీష్ ,జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ ,సుదీర్,జాయింట్ సెక్రటరీలు  డీ సునీల్ కుమార్ ,శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లి సునీల్ కుమార్ చౌదరి, కార్యవర్గ సభ్యుడు రమేశ్వర్ నాయక్  పాల్గొన్నారు.

No comments:

Post a Comment