పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం ; ఎమ్మెల్యే కోవ లక్ష్మి
- డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 25 : పేద ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. బుధవారం నాడు రెబ్బెన మండలం ఇందిరా నగర్ లోని జూనియర్ కాలేజీ భవనం పక్కన సుమారు ఒకటిన్నర ఎకరాల స్థలంలో రెబ్బెన మండలానికి మంజూరైన ముప్పై డబల్ బెదురూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గతంలో ఏ ప్రభుత్వం చేయనంత ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వాటిని కార్యరూపంలో చేసి చూపిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి అజ్మీర బాపు రావు, ఎం పి పి కర్నాధం సంజీవ్ కుమార్, రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింగం,, వైస్ ఎం పి పి రేణుక, రెబ్బెన సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య, కాంట్రాక్టర్ నరేందర్, టి ఆర్ ఎస్ నాయకులు సోమశేఖర్, నవీన్ కుమార్ జైస్వాల్, సుదర్శన్ గౌడ్, చిరంజీవి గౌడ్, మడ్డి శ్రీనివాస్ గౌడ్,, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment