అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
- పాలనాధికారి కార్యాలయం ఎదుట ధర్నా వినతిపరం సమర్పణ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 23 : అకాల వర్షాలతో పత్తిపంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సోమవారంనాడు జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట బూరుగుడ రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం పాలనాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వర్షాభావం మరియు అకాల వర్షాల వాళ్ళ జిల్లాలో పత్తి పంట తీవ్రంగా నష్టపోయిందని కావున ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలోబూరుగుద సర్పంచ్ కాశయ్య ,ఎంపీటీసీ రమేష్,ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డ్ మెంబెర్ మహేష్ ,పిడుగు వెంకటేశం, పెంటయ్య, నారాయణ మరియు రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment