Monday, 9 October 2017

రేపు నూతన జిల్లా కార్యాలయాలకు భూమి పూజ

రేపు నూతన జిల్లా కార్యాలయాలకు  భూమి పూజ 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 09 :   పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లా కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో నూతన పాలనాధికారి కార్యాలయంతో సహా మరిన్ని శాఖల కార్యాలయాల కోసం జిల్లా ఏర్పాటు చేసి సంవత్సరం అవుతున్న సందర్బంగా బుధవారం ఉదయం 11 గంటల 10 నిమిషాలకు   జిల్లా కేంద్రoలోని ఎంపిక చేసిన స్థలంలో  భూమి పూజ చేపట్టడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ  శాఖ మంత్రి జోగు రామన్న హాజరు అయ్యి శంకుస్థాపన చేస్తారని జిల్లా పాలనాధికారి చంపాలాల్ తెలిపారు. సోమవారం తాత్కాలిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాలనాధికారి మాట్లాడారు. భూమి పూజ అనంతరం అన్ని శాఖల పైన రివ్యూ మీట్ స్థానిక ప్రేమల గార్డెన్స్ లో ఉంటుందని జిల్లాలోని అన్ని శాఖల అధికారులు  హాజరు అవ్వాలని కోరారు. పాలనధికారితో జాయింట్ కలెక్టర్ అశోక్, డిఆర్డిఓ శంకర్, ఇంచార్జి డిఆర్వో రమేష్, ఆర్డీఓ రమేష్ బాబు, జిల్లా వివిధ శాఖ అధికారు ఉన్నారు.

No comments:

Post a Comment