Tuesday, 3 October 2017

అప్రజాస్వామిక జి ఓ లను రద్దు చేయాలి :టి జాక్

అప్రజాస్వామిక జి ఓ లను రద్దు చేయాలి :టి జాక్ 




కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 03 :   అప్రజాస్వామికంగా జారీ చేసిన జి ఓనెంబర్  39/17 మరియు 42/17  లను వెంటనే రద్దుచేయాలని  ఆసిఫాబాడ్ మాజీ ఎం ఎల్ ఏ  ఆత్రంసక్కు , తెలంగాణ జాక్ కన్వీనర్ ఎల్ రమేష్,డి సి సి జనరల్ సెక్రటరీ విశ్వప్రసాద్ లు సోమవారంనాడు ఆసిఫాబాద్ లో ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ విద్యావంతుల వేదిక  జె  ఏ  సీ ఆధ్వర్యంలో    జరిగిన సమావేశంలో ప్రభుత్వాన్నిడిమాండ్ చేసారు. ఈ సందర్బంగా జాక్ కన్వీనర్ ఎల్ రమేష్ మాట్లాడుతూ   రైతు సమన్వయ సమితుల కూర్పు ప్రజాస్వామికంగా జరుగ లేదని  సమితులలో కౌలు,అసైన్డ్ ,పోదు చేసే రైతులకు స్థానంకల్పించకుండా,గ్రామసభలు నిర్వహించకుండా  కేవలం టి ఆర్ ఎస్ కార్యకర్తలను నామినెటే చేసి వాటినే సమితులంటున్నారని అన్నారు. ఉన్న స్థానిక  సంస్థలను బలోపేతం చేయకుండా వాటి ప్రధాన ఉద్దేశాన్ని మంటకలిపే విధంగా ఈ నూతన సమితులను తెరపైకి ప్రభుత్వం తెరమీదకు తీసుక వచ్చిందని ,, ఇప్పటికే గ్రామా స్థాయిలో చట్ట ప్రకారం వోటింగ్ పద్దతి ద్వారా ఏర్పడ్డ స్థానిక సంస్థల పాలక వర్గాలు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల పంపిణి బ్యాంకు రుణాలలో సహకారం అందిస్తూ రైతుకు అండగా నిలుస్తున్నాయని, వాటిపై  ఈ  రైతు సమితులు పెత్తనం చెలాయించే వీలుందని అన్నారు. ఈ రైతు సమితులలోని సభ్యులు గ్రామాలలో  నయా పెత్తందారులుగ, జాగీర్దారులుగాతయారయ్యే అవకాశముందని అన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సమితులను గమనిస్తే అధికార టి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. దీని అర్ధం రాజ్యాంగ బద్దంగా ఉన్న సమస్తాలను నీరుగార్చడమే ప్రధాన ఉద్దేశంగా కనబడుతుందని, ఈ రాజ్యాంగ బద్ద సంస్థలకు సమాంతరంగా ప్రజల సొమ్ముతో తమపార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ సైన్యమే ఈ రైతు సమితులని అన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ,వ్యవసాయ రంగ   తీసుకొమ్మని వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలనీ  హైకోర్టు ఇచిన సూచనలను పట్టించుకోకుండా తన అధికారాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలలో భాగమే ఈ సమితులని వక్తలు అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ ఆనంద్,ప్రధాన కార్యదర్శి ఆత్మారాం, సి పి  ఐ జిల్లా కార్యదరి బద్రి సత్యనారాయణ, ,కార్యదర్శి రాయల నర్సయ్య, ప్రైవేట్ విడీసంస్తల జాక్ అధ్యక్షులు కిషన్ రావు,రైతు జాక్ గణేష్ లాల్, కిషన్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment