మంచిర్యాలలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్నీ విజయవంతం చేయండి ; ఖాండ్రే విశాల్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 28 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాని సమావేశాన్ని విజయవంతం చేయాలనీ ఆసిఫాబాద్ బీజేపీ మండల అధ్యక్షులు ఖాండ్రే విశాల్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారంనాడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి శ్రీ హంసరాజు ఆహిల్ ,కేంద్రమంత్రివర్యులు హాజరు కానున్నారని ఇందులో భాగంగా ఆసిఫాబాద్ లో భారతరత్న బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తామని, స్థానిక బీజేపీ నాయకులను అభిమానులను ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ,మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేపట్టిన పథకాలపై అవగాహనా కల్పిస్తారని, కావున స్థానిక బీజేపీ నాయకులూ, అభిమానులు, ప్రజలు ఆదివారంపెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు. ఈ సమావేశంలో మెకార్టి గోపాల్, నిర్మల, రాధికా,రాజ్ కుమార్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment