Tuesday, 3 October 2017

రైతు సమన్వయ సమితుల కూర్పుఫై ఎం పి డి ఓ కు వినతి

రైతు సమన్వయ సమితుల కూర్పుఫై ఎం పి  డి ఓ కు వినతి

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 03 :    జి ఓనెంబర్  39/17 మరియు 42/17  లను నిలిపివేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 37,42 జి ఓ  లను నిలిపివేయాలని జాక్ కన్వీనర్ ఎల్ రమేష్   రెబ్బెన ఎం పి  డి ఓ సత్యనారాయణ సింగ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సందర్బంగా జాక్ కన్వీనర్ ఎల్ రమేష్ మాట్లాడుతూ   రైతు సమన్వయ సమితుల కూర్పు ప్రజాస్వామికంగా జరుగ లేదని  సమితులలో కౌలు,అసైన్డ్ ,పోదు చేసే రైతులకు స్థానంకల్పించకుండా,గ్రామసభలు నిర్వహించకుండా  కేవలం టి ఆర్ ఎస్ కార్యకర్తలను నామినెటే చేసి వాటినే సమితులంటున్నారని అన్నారు.  సత్యాగ్రహం జీవో 39,42 లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని గ్రామ, మండల స్థాయిలో ఏర్పచిన రైతు సమన్వయ సమితులను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాక్ కో కన్వీనర్ రాయల నర్సయ్య, ఏ  ఐ టి యూ సీ  సెక్రటరీ బోగే ఉపేందర్, సి ఫై ఐ మండల కార్యదర్శి రామడుగు శంకర్, ఉప కార్యదర్శి,బానోతు కిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment