స్కాలర్ షిప్స్, ఫీజు రియింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ( వుదయం ప్రతినిధి ) అక్టోబర్ 27: పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మరియు రియింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ ,రియింబర్స్ మెంట్ విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ కుమురం భీం జిల్లా సమితి ఆద్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ స్కాలర్ షిప్స్,రియింబర్స్ మెంట్ విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నరాని ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతో సతమతమవుతుంటే కెసిఆర్ ప్రభుత్వం విద్యాను ప్రైవేటీకరణ చేసే విధంగా విధానాలు అవలంభిస్తుందని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోకి ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు. సంక్షేమ వసతి గృహల్లో విద్యార్థులు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నరాని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజనం ప్రకటనలకే పరిమితం అయిందని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ,పాలిటెక్నిక్,ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి,శ్రీకాంత్,పర్వతి సాయి,మహిపాల్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment