పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి :జిల్లా ఇంచార్జ్ ఎస్పి యం . శ్రీనివాస్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ( వుదయం ప్రతినిధి ) అక్టోబర్ 27 జిల్లా లో ఎటువంటి పెండింగ్ కేసు లు ఉండకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంచార్జ్ ఎస్పి యం. శ్రీనివాస్ తెలిపారు, శుక్రవారం జిల్లా లోని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ లోని సమావేశ మందిరం లో జిల్లా ఇంచార్జ్ ఎస్పి జిల్లా లోని అధికారుల తో సమావేశమును నిర్వహించి జిల్లా లో శాంతి భద్రత ల నిర్వహణ కు తీసుకోవలసిన చర్యల గురించి మరియు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున జిల్లా లో ముందస్తూ గా అవలంబించాల్సిన పద్దతులను గురించి అధికారులకు వివరించారు,నిందితులను కస్టడీ లోకి తిసుకున్నపుడు తగు జగరుకతతో వుండాలని సూచించారు ,సమస్య ఉత్పన్నమైనప్పుడు సత్వరం జిల్లా అధికారులు స్పందించాలని ఇంచార్జ్ ఎస్పి యం. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశం లో జిల్లా డిఎస్పి హబీబ్ ఖాన్ , ఎస్బి సి ఐ సుధాకర్ ,ఆసిఫాబాద్ టౌన్ సి ఐ వినోద్ ,కాగజ్ నగర్ టౌన్ సి ఐ వెంకటేశ్వర్ , కాగజ్ నగర్ రూరల్ సి ఐ ప్రసాద్ రావు , వాంకిడి సి ఐ శ్రీనివాసు, రెబ్బెన సి ఐ మదన్ లాల్, ఎస్బి ఎస్సై శివకుమార్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment