Sunday, 29 October 2017

హైదరాబాద్ లో కొలువుల కొట్లాట సభను విజయవంతం చెయాలి

హైదరాబాద్ లో   కొలువుల కొట్లాట సభను విజయవంతం చెయాలి
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 29 :  చదువు కున్న యువతకు  ఉద్యోద నోటిఫికేషన్ ఇచ్చి  వాటిని భర్తీ చేయాలని తలపెట్టిన హైదరాబాద్ లో జరుగు కొలువుల కొట్లాట సభను విజయవంతం చేయాలనీ  కొమురంభీం జిల్లా జాక్ కో  కన్వీనర్ రాయల  నర్సయ్య అన్నారు. తెలంగాణ జాక్    ఆధ్వర్యంలో ఆదివారం రెబ్బెన మండలం  గోలెటి లో ఎర్పాటు చేసిన సమవేశం లో  సభకు సంబందించిన గోడ ప్రతులను విదులచేసి మాట్లాడారు.   తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలని,చదువు కున్న యువతకు  ఉద్యోగ  నోటిఫికేషన్ ఇచ్చి  వాటిని భర్తీ చేయాలని అలాగే ఉద్యోగ కాలెండర్ ను విడుదల చేయలని, ప్రవేట్ ఉద్యోగాలలో స్థానిక యువకులకు  అవకాశం ఇవ్వాలన్నడిమాండ్ తో  మంగళవారంనాడు  హైదరాబాద్ లో  తలపెట్టిన సభకు నిరుద్యోగులు, యువకులు తెలంగాణ వాదులు అందరు కలసి అధిక సంఖ్యలో పాల్గొని    విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.  ఈ సమవేశం లో  జిల్లా  రైతు జాక్  నాయకులూ గణేష్ లాల్ ,కిషణ్ ,సురెష్,హరి ప్రేమనాయక్, కే దేవయ్య, రామ కృష్ణ, వంశీకృష్ణ, సందీప్ , శ్రీకాంత్ ,సాయి లక్ష్మి , ప్రసన్న,సోనీ ,అశోక్  తదితరుల పాల్గోన్నారు .

No comments:

Post a Comment