దోడ్డు బియ్యంతోనే విద్యార్థులకు భోజనం ; ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 26 : రాష్ట్రంలో విద్యార్థులకు దోడ్డు బియ్యంతోనే భోజనం పెడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ ఆరోపించారు. గురువారం రోజున మండలంలోని రెబ్బెన, నంబాల ఉన్నత పాఠశాలలను ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో సందర్శించడం జరిగిందని తెలియజేశారు. రెబ్బెనలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తింటున్న భోజనాన్ని పరిశీలించగా విద్యార్థులకు దోడ్డు బియ్యంతో భోజనం పెడుతున్నరని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన సెప్టెంబర్ నెలలో రావాల్సిన సన్న బియ్యం రాకపోవడంతో దోడ్డు బియ్యంతో విద్యార్థులకు మధ్యహ్న పెట్టడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్రిక ప్రకటనలకే పరిమితం అయిందని, దోడ్డు బియ్యాన్నే సన్నగా చేసి పాఠశాలలకు వసతి గృహలకు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. చలి కాలం ప్రారంభమైనందున వసతి గృహలకు తలుపులు, కిటికీలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, మండల కార్యదర్శి పర్వతి సాయి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment