అబ్దుల్ కలాం సేవలు మరువ లేనివి
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 15 :మాజీ రాష్ట్ర పతి దివంగత అబ్దుల్ కలాం సేవలు మరువలేనివని అబ్దుల్ కలం పాఠశాలలో కరెస్పాండంట్ అబుల్ ఫయాజ్ అన్నారు . కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్లో ఆదివారంనాడు అబ్దుల్ కలం పాఠశాలలో అబ్దుల్ కలాం 86 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగాపాఠశాల కరెస్పాండంట్ అబుల్ ఫయాజ్ మాట్లాడుతూ . రాష్ట్రపతి గా అబ్దుల్ కలాం నిరాడంబర జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు . దేశానికిశాస్త్రవేత్తగా ,హైద్రాబాద్లోని డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్, రాకెట్ సెంటర్ ఇమారత్ వేదికగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలలో అబుల్ క,లామ్ తనదైన ముద్రవేశారని, అతని సేవలు మరువలేనివని కొనియాడారు. పేద కుటుంబములో పుట్టి , శాస్త్రవేత్తగా ఎదిగి , రాష్ట్ర పతిగా దేశానికి ఎనలేని సేవలు చేసి దేశ గౌరవం కాపాడిన మహా గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం అని తెలిపారు . విద్యార్థులు అతన్నీ ఆదర్శనంగా తీసుకొని , సమాజములో మంచి గుర్తింపు పొందాలని అన్నారు . అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు . ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు హిదయతుల్లా ,అశోక్,రఫీక్, ప్రవీణ్, హకీమ్ అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment