Saturday, 21 October 2017

పోలీస్ అమరవీరులు స్పూర్తి ప్రదాతలు వారి త్యాగాలు అమరం

పోలీస్ అమరవీరులు  స్పూర్తి ప్రదాతలు వారి త్యాగాలు అమరం 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 21 :పోలీస్ అమరవీరుల త్యాగాలు సదా చిరస్మరణియం అని , సమాజ శ్రేయస్సు , శాంతి భద్రతల పరిరక్షణలో రోజుల తరబడి వుంటూ ఎన్ని అటుపోటులు ఎదురు అయిన  ప్రజల కోసం మేము వున్నాం అని భరోసా కలిపిస్తూ, ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా చివరకు కర్తవ్య నిర్వహణ లో తమ తమ తమ ప్రాణాలను తృణప్రాయం గా బావించి  ప్రాణ త్యాగం చేసి నవ సమాజ నిర్మాణమునకు బాటలు వేసిన పోలీస్ అమరవీరులను , వారి త్యాగాలను గుర్తువుంచుకొని , వారి స్పూర్తి ను మనం పొందాలని ముఖ్య అతిధులుగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ , ఎం ఎల్ ఏ   కోవా లక్ష్మి మరియు  ఎం ఎల్ సి  పురాణం సతీష్ లు అన్నారు, శనివారం జిల్లా లోని  స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీస్ సంస్మరణ దినం సందర్బముగా  అమరవీరుల స్మృత్యర్థం  జిల్లా  లోని పలు పట్టణ పుర వీదుల గుండా అమరవీరుల ప్లకార్డ్  ల తో కూడిన  ర్యాలి  ను జిల్లా పోలీస్ ల అద్వర్యం లో నిర్వహించారు అనతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల కోసం స్మృతి పెరేడ్ ను నిర్వహించారు, అనంతరం ఈ సంవత్సరం విధి నిర్వహణ లో అసువులు బాసిన 383 అమరుల యొక్క పేర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ చదివి వినిపించారు వారి సేవలను స్మరించుకుంటూ వారికి   అంజలి ఘటించారు. అతిధులు , పోలీస్ సిబ్బంది  మరియు  విద్యార్థులు అమరవీరుల స్తూపంనకు పూలమాలలు వేసి ఘనమైన నివాళులను అర్పించారు, అమరవీరుల వారోత్సవాలలో బాగం గా గత వారం రోజులు గా నిర్వహిస్తున్న వ్యాస రచన , పెయింటింగ్ , ఉపన్యాస పోటిలలో గెలుపొందిన విద్యార్థులు అయిన  లక్ష్మి దహేగం .మహేష్  చింతలమానేపల్లి, ఎం . లక్ష్మి ప్రియ  కృష్ణవేణి హై స్కూల్ కాగజ్ నగర్ , .నమ్రత  రెబ్బెన, కౌశిక్ సింగ్ రెబ్బెన , B. లక్ష్మణ్ రాసపల్లి   లకు మరియు పోలీస్ శాఖ నుంచి వ్యాస రచన పోటిలలో  శ్రీనివాస్ ఎస్సై తిర్యాని ,  తిరుపతి ఎస్సై లింగాపూర్  మహేందర్ రెడ్డి హెడ్ కాన్స్టేబుల్ , తిరుమల  అసిస్టెంట్ సబ్  ఇన్స్పెక్టర్ మరియు బబ్బెర శేఖర్  లకు జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ , ఎం ఎల్ ఏ   కోవా లక్ష్మి మరియు  ఎం ఎల్ సి  పురాణం సతీష్ ల యొక్క చేతుల మీదుగా బహుమతులను అందించారు.ఈ కార్యక్రమము లో డిఎస్పి హబీబ్ ఖాన్ , జిల్లా సి ఐ లు ఎస్సై లు, ఎస్బి సి ఐ సుధాకర్ , ఎస్బి ఎస్సై శివ కుమార్ ,  శ్యాం సుందర్ ,పోలీస్ రవాణా అధికారి శ్రీనివాస్ , ఆర్ ఐ వామన మూర్తి , ఆర్ ఎస్సై లు అనిల్ కుమార్ , శేఖర్, ఆసిఫాబాద్ సర్పంచ్ మర్సకోల సరస్వతి , గ్రందాలయ కమిటి చైర్మన్ కనక యాదవ్ రావు , , సింగల్ విండో చైర్మన్ అలిద్దిన్ అహ్మద్ , మార్కెట్ కమిటి చైర్మన్ గంధం శ్రీనివాస్ , పీ.ఆర్.ఓ  మనోహర్  మరియు జిల్లా  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 




No comments:

Post a Comment