Monday, 16 October 2017

బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందిచాలి – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

బాధితుల  ఫిర్యాదులపై  తక్షణం స్పందిచాలి  – జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ 
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 16 :పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులను అధికారులే స్వయముగా తెలుసుకొని  సత్వరం స్పందించాలి అని   జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పి అద్వర్యం లొ ప్రజా ఫిర్యాదుల విబాగం ను నిర్వహించి ,వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది ఫిర్యాదుల ను జిల్లా ఎస్పి స్వయముగా స్వీకరించారు, ప్రజా ఫిర్యాదు లో అల్లూరి శాంతభాయి భర్తపేరు   లింగయ్య తన యొక్క భూమి ను అన్యులు అక్రమము గా ఆక్రమించుకొని తనకు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదు చేసారు, మెరుగు రాజేష్ తన పైన కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సస్పెక్ట్ కేసు ను తొలగించి తన యొక్క చదువు కు సహకరించాలి అని జిల్లా ఎస్పి ను వేడుకున్నారు,మరియు జిల్లా లోని  పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ తమ ఫిర్యాధులను జిల్లా ఎస్పి కు విన్నవించారు సమస్యల పైన స్పందించిన జిల్లా ఎస్పి ఫిర్యాదు దారులకు సాంత్వన చేకురేలా చర్యలు తీసుకుంటానని ఫిర్యదుదారులకు హామీ ను ఇచ్చారు, తగు సూచనలతో సంబందిత అధికారులను ఫిర్యాదులు పరిష్కారం అయ్యేలా ఆదేశించారు.ఈ కార్యక్రమం లో  ఎస్పి సీసీ దుర్గం శ్రీనివాస్ , ఎస్బి సీ ఐ సుధాకర్, ఎస్బి ఎస్సై లు శివకుమార్ , శ్యాం సుందర్ , డిసీఆర్బీ ఎసై రాణాప్రతాప్ , అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్  ప్రహ్లాద్, కరుణ ,సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ ,కేదార సూర్యకాంత్ ఫిర్యాదుల విభాగం అధికారిని సునీత మరియు పీ ఆర్ ఓ మనోహర్ లుబాధితుల  పాల్గొన్నారు.

No comments:

Post a Comment