Monday, 30 October 2017

ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా పాలనాధికారి చంపాలాల్

ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి :: జిల్లా పాలనాధికారి చంపాలాల్ 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 30 :  ప్రజాఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు కృషిచేయాలని కొమురంభీం జిల్లా పాలనాధికారి చంపాలాల్ జిల్లా అధికారులను  ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో ప్రజలవద్దనుంచి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత  అధికారులను పై విధంగా ఆదేశించారు. సోమవారంనాడు పలు మండలాలనుంచి 65 మంది ఫిర్యాదులను అందించారు .కాగజ్ నగర్ కు  చెందిన మహమ్మద్ ఆఫ్జాల్ కు చెందిన భూములు చేవెళ్ల కాలువ నిర్మాణంలో ముంపునకు గురయ్యాయని,తగు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. నవేగంకు చెందిన దాగం మోహన్ ఖైర్గమ్ గ్రామా శివారులో వారసత్వంగా వచ్చిన భూమి గురించి, ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్, చీఫ్ ప్లానింగ్అధికారి  కిష్టయ్య, డి ఆర్ డి ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ తదితర జిల్లా అధికారులుపాల్గొన్నారు.

No comments:

Post a Comment