కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) అక్టోబర్ 05 : అక్రమంగా తరలిస్తున్న కలప దిమ్మలు గురువారం ఆటోలో పంగిడి మాదారం నుంచి గోలేటి మీదుగా తాండూర్ వైపు ఏ పి 01 ఎక్స్ 6928 నంబర్ గల ఆటోలో తరలిస్తుండగా డీఎఫ్ ఓ వెంకటేశ్వర్లు సమాచారమేరకు రెబ్బన మండలం లోని గోలేటి లో మాటు వేసి స్వాధీన పరుచుకున్నట్లు అటవి క్షేత్ర అధికారి రాజేందర్ ప్రసాద్ , తెలిపారు. వీటి విలువ వేళా 5044 రూపాయలు ఉంటుందన్నారు, అదేవిధంగా ఏ పి 01 ఏ బి 1866 నెంబర్ గల ట్రాక్టర్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా అదుపులోనికి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరితో పేరు ఫారెస్ట్ సెక్క్షన్ ఆఫీసర్ ఎం డి అక్తరోద్దిన్ , ఎఫ్ బి ఓ లు మహమ్మద్ షరీఫ్, తిరుపతి సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment